close
Array ( ) 1

తాజా వార్తలు

ఓహో.. అలాగా! ఐతే ఐపీఎల్‌ ఆడకండి: కపిల్‌

ముంబయి: టీమ్‌ఇండియా మాజీ సారథి కపిల్‌ దేవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయ జట్టు తరఫున నిరంతరం ఆడుతున్న క్రికెటర్లు అలసిపోయామని భావిస్తే ఐపీఎల్‌ ఆడొద్దని సూచించారు. మ్యాచులు, సిరీసులకు మధ్య కనీస విరామం ఉండటం లేదని క్రికెటర్లు వాపోతున్న నేపథ్యంలో ఆయన ఘాటుగా స్పందించారు. సాధన చేసేందుకు తమకు సరైన సమయం దొరకలేదని సారథి విరాట్‌ కోహ్లీ న్యూజిలాండ్‌లో వెల్లడించిన సంగతి తెలిసిందే.

‘ఒత్తిడి, అలసట, శారీరక బడలిక ఉన్నట్టు అనిపిస్తే ఐపీఎల్‌ ఆడకండి. ఇక్కడ మీరేమీ దేశానికి ప్రాతినిధ్యం వహించడం లేదు. నిజంగానే మీరు అలసిపోయారని భావిస్తే ఐపీఎల్‌ సమయంలో విశ్రాంతి తీసుకోండి. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అనుభూతే మరోలా ఉంటుంది’ అని కపిల్‌ అన్నారు.

దేశం తరఫున ఆడుతున్నప్పుడు ఆటగాళ్లు అత్యుత్తమంగా శ్రమించాలని హరియాణా హరికేన్‌ సూచించారు. ఫ్రాంచైజీ క్రికెట్‌ కోసం అంత కష్టపడుతున్నప్పుడు దేశం కోసం ఎందుకు రాజీపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. వన్డే సిరీసులో 0-3తో ఓటమి, అలసట, ఒత్తిడి వల్లే న్యూజిలాండ్‌తో టెస్టు సిరీసులో టీమ్‌ఇండియా ఓడిపోయిందా? అని అడగ్గా ‘నాకు తెలియదు. టీవీల్లో చూసి మాట్లాడటం సబబు కాదు’ అని ఆయన చెప్పారు.

భారత జట్టుకు ఆడుతున్నప్పుడు ఎన్నోసార్లు అలసట, ఒత్తిడిని అనుభవించానని కపిల్‌ గుర్తు చేసుకున్నారు. ‘ఒక సిరీసుకు ఎంపికై నిరంతరం ఆడుతున్నా పరుగులు, వికెట్లు రాకుంటే అలసట, నిస్సత్తువ ఆవహిస్తుంది. రోజుకు 20-30 ఓవర్లు వేసిన ఏడెనిమిది వికెట్లు తీస్తే అలసటగా అనిపించదు. హుషారుగా ఉంటుంది. పది ఓవర్లే వేసి 80 పరుగులిచ్చి వికెట్లేమీ తీయకపోతే ఎంతో అలసటగా అనిపిస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.