
తాజా వార్తలు
వేలం ముంగిట కుర్రాళ్లకు పరీక్ష
ముస్తాక్ అలీ క్వార్టర్స్ నేటి నుంచే
ఇంటర్నెట్‌డెస్క్: వచ్చే నెలలో ఐపీఎల్ మినీ వేలం ఉండబోతున్న నేపథ్యంలో ఫ్రాంఛైజీలను ఆకట్టుకునేందుకు కుర్రాళ్లకిదే చివరి అవకాశం. నేటి నుంచే సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ క్వార్టర్స్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మంగళవారం తొలి మ్యాచ్‌లో పంజాబ్‌తో కర్ణాటక, రెండో మ్యాచ్‌లో తమిళనాడుతో హిమాచల్ ప్రదేశ్ తలపడనున్నాయి. బుధవారం మ్యాచ్‌ల్లో హరియాణాతో బరోడా, రాజస్థాన్‌తో బిహార్ పోటీపడనున్నాయి. సరికొత్తగా రూపొందించిన సర్దార్ పటేల్ మొతేరా స్టేడియంలో ఈ మ్యాచ్‌లన్నీ జరగనున్నాయి. ఆ స్టేడియాన్ని పునరుద్ధరించాక నిర్వహించనున్న తొలి మ్యాచ్‌లు ఇవే. మరోవైపు ఇంగ్లాండ్‌తో చివరి రెండు టెస్టులకు ఆ స్టేడియమే వేదిక కానున్న నేపథ్యంలో ఈ టీ20 మ్యాచ్‌ల్లో పిచ్ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.
తొలి క్వార్టర్స్‌లో పంజాబ్‌తో తలపడనున్న డిఫెండింగ్ ఛాంపియన్ కర్ణాటక టైటిల్ నిలబెట్టుకునే దిశగా మరో అడుగు వేయాలనే పట్టుదలతో ఉంది. దేవ్‌దత్ పడిక్కల్, శ్రేయస్ గోపాల్, సుచిత్, అభిమన్యు మిథున్, ప్రసిధ్ కృష్ణన్ ఆ జట్టులో కీలకం కానున్నారు. అయితే లీగ్ దశలో ఆడిన అయిదు మ్యాచ్‌లూ గెలిచిన పంజాబ్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. యువ ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్, సిద్ధార్థ్ కౌల్, సందీప్ శర్మ, మయాంక్ మార్కండేలపై ఆ జట్టు ఆశలు పెట్టుకుంది. హిమాచల్ ప్రదేశ్‌తో మ్యాచ్‌లో తమిళనాడు ఫేవరేట్‌గా కనిపిస్తోంది. కెప్టెన్ దినేశ్ కార్తీక్, జగదీశన్, మురుగన్ అశ్విన్, సాయి కిశోర్, బాబా అపరాజిత్లతో ఆ జట్టు బలంగా ఉంది. తండ్రి మరణంతో టోర్నీ మధ్యలో వైదొలిగిన కెప్టెన్ కృనాల్ పాండ్య లేని బరోడా.. చాహల్, జయంత్ యాదవ్, రాహుల్ తెవాటియా లాంటి స్టార్ స్పిన్నర్లను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.
ఇవీ చదవండి..