Lovlina Borgohain: పంచ్‌ విసిరి.. ఆడపిల్లలకు ప్రేరణగా నిలిచావ్..!

తాజా వార్తలు

Updated : 04/08/2021 13:43 IST

Lovlina Borgohain: పంచ్‌ విసిరి.. ఆడపిల్లలకు ప్రేరణగా నిలిచావ్..!

కాంస్య పతకాన్ని అందించిన బాక్సర్‌పై ప్రముఖుల ప్రశంసలు

దిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారత మూడో బాక్సర్‌గా నిలిచి.. అస్సాం అమ్మాయి లవ్లీనా బొర్గొహెయిన్ చరిత్ర సృష్టించింది. అరంగేట్రంలోనే అద్భుత ప్రదర్శన చేసి.. కాంస్య పతకాన్ని ముద్దాడింది. ఈమె స్ఫూర్తిదాయకపోరాటంపై ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

* లవ్లీనా బొర్గొహెయిన్‌కు అభినందనలు. మీ కృషి, దృఢ సంకల్పంతో దేశం గర్వపడేలా చేశారు. ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించి యువతకు స్ఫూర్తిగా నిలిచారు. మరీ ముఖ్యంగా సవాళ్లతో పోరాడి, కలల్ని సాకారం చేసుకోవాలనే ఆడపిల్లలకు మీ విజయం ప్రేరణనిస్తుంది... రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 

ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన లవ్లీనాకు నా అభినందనలు. ఆమె దేశం మొత్తం గర్వపడేలా  చేశారు... ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 

లవ్లీనా బొర్గొహెయిన్ అద్భుతంగా పోరాడావు. నీ విజయం ఎంతోమంది భారతీయులకు స్ఫూర్తినిస్తుంది. లవ్లీనా చూపిన తెగువ, సంకల్పం అద్భుతం. దేశానికి కాంస్య పతకం అందించినందుకు కృతజ్ఞతలు. భవిష్యత్తులో మరిన్ని విజయాలతో దూసుకెళ్లాలి.. ప్రధాని నరేంద్ర మోదీ

లవ్లీనా.. నువ్వు అత్యుత్తమంగా పంచ్‌ విసిరావు. నువ్వు సాధించిన విజయం పట్ల భారత్ గర్వంగా ఉంది. అరంగేట్రంలోనే పతకం సాధించావు. నీ ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది. గొప్పగా పోరాడావు.. క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్

ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించిన అస్సాం బిడ్డకు నా అభినందనలు. అస్సాం చరిత్రలో నీ పేరు సువర్ణాక్షరాలతో లిఖిస్తారు. నీ అద్భుత విజయానికి దేశం మొత్తం గర్వపడుతోంది... అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ

లవ్లీనా..నువ్వు దేశం మొత్తం గర్వపడేలా చేశావు. కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నందుకు నీకు అభినందనలు. నీ విజయం పట్ల మేం గర్వంగా ఉన్నాం.. కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని