
తాజా వార్తలు
గబ్బా టెస్టు: తొలి వికెట్ కోల్పోయిన భారత్
బ్రిస్బేన్: గబ్బా టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ శుభ్‌మన్‌గిల్(7) ఔటయ్యాడు. కమిన్స్ వేసిన 6.2వ ఓవర్‌కు స్లిప్‌లో స్మిత్ చేతికి చిక్కాడు. దీంతో భారత్ 11 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. పుజారా క్రీజులోకి రాగా రోహిత్(4) పరుగులతో ఆడుతున్నాడు. 8 ఓవర్లకు టీమ్ఇండియా స్కోర్ 17/1గా నమోదైంది. అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌటైంది. శనివారం 274/5తో రెండో రోజు ఆట కొనసాగించిన ఆతిథ్య జట్టు మరో 95 పరుగులు చేసి చివరి ఐదు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ టిమ్‌పైన్ అర్ధశతకం సాధించాడు. భారత బౌలర్లలో నటరాజన్, శార్దుల్ ఠాకుర్, వాషింగ్టన్ సుందర్ మూడేసి వికెట్లు తీశారు.
ఇవీ చదవండి..
శతకం చేశాక సెలబ్రేట్ చేసుకోను: లబుషేన్
అభిమానుల దుశ్చర్య:సిరాజ్‌పై వ్యాఖ్యలు
Tags :