అది టీమిండియా అర్థరహిత నిర్ణయం
close

తాజా వార్తలు

Updated : 06/02/2021 17:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అది టీమిండియా అర్థరహిత నిర్ణయం

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టుకు స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ను బెంచ్‌కే పరిమితం చేయడం టీమిండియా తీసుకున్న అర్థరహిత నిర్ణయమని మాజీ క్రికెటర్‌ మైకేల్‌ వాన్‌ అన్నాడు. ‘‘టీమిండియా తీసుకున్న అర్థరహిత నిర్ణయమిది. గాయాలతో ఆటగాళ్లు దూరమైనా, స్వదేశంలో టెస్టులు జరుగుతున్నా.. కుల్‌దీప్‌ను జట్టులోకి తీసుకోలేదు. ఇక అతడు ఎలాంటి సందర్భాల్లో జట్టులో ఉంటాడు?’’ అని వాన్ ట్వీట్ చేశాడు.

గాయంతో జడేజా జట్టుకు దూరమవ్వడంతో కుల్‌దీప్‌ జట్టులో ఉంటాడని భావించానని మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ కూడా అన్నాడు. చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో కుల్‌దీప్‌కు చోటు దక్కని విషయం తెలిసిందే. రవిచంద్రన్‌ అశ్విన్‌తో పాటు యువ స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్‌, షాబాజ్ నదీమ్‌ జట్టులో చోటు సంపాదించారు. అయితే ఆస్ట్రేలియా పర్యటనలోనూ కుల్‌దీప్‌కు నిరాశే మిగిలింది. నాలుగు టెస్టుల్లోనూ అతడికి అవకాశం రాలేదు. 2019 జనవరిలో సిడ్నీ వేదికగా కుల్‌దీప్‌ ఆఖరి టెస్టు ఆడాడు.

ఇవీ చదవండి

క్రీడా స్ఫూర్తికి సలామ్‌: రూట్‌కు కోహ్లీ సాయం

చెపాక్‌లో ‘రూట్‌’ వేశాడు!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని