కుల్‌దీప్‌కు లైయన్‌, అశ్విన్‌ సలహాలు

తాజా వార్తలు

Published : 03/02/2021 21:09 IST

కుల్‌దీప్‌కు లైయన్‌, అశ్విన్‌ సలహాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆసీస్‌ సీనియర్‌ స్పిన్నర్‌ నేథన్‌ లైయన్‌, టీమ్‌ఇండియా ఆటగాడు రవిచంద్రన్‌ అశ్విన్‌ వద్ద మెలకువలు నేర్చుకున్నానని చైనామన్‌ స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ వెల్లడించాడు. వారిద్దరూ గొప్ప సలహాలు సూచించారని పేర్కొన్నాడు. ఐపీఎల్‌ 2020లో తన బౌలింగ్‌ లయ బాగుందని వెల్లడించాడు. తనకు మరిన్ని మ్యాచుల్లో అవకాశం వస్తే బాగుండేదని వివరించాడు. ఆసీస్‌ పర్యటనలో కుల్‌దీప్‌కు ఒక్క మ్యాచులోనూ అవకాశం రాని సంగతి తెలిసిందే.

‘నేథన్‌ లైయన్‌తో చాలా మాట్లాడాను. అతడేం చేస్తాడో, ఎలా సన్నద్ధమవుతాడో అడిగాను. తేలికపాటి కసరత్తులే చేస్తానని బదులిచ్చాడు. తన నైపుణ్యాలు, టర్న్‌ చేసేందుకు బంతిపై చేతివేళ్లను ఎలా కదుపుతాడో తెలిపాడు. అదే అతడి బలమన్నాడు. సొంత కసరత్తులే అనుసరించమని సూచించాడు. బంతిని పిచ్‌ చేసే ప్రదేశాలను గుర్తించాలని వివరించాడు. చిరునవ్వుతో నా బౌలింగ్‌ను ఆస్వాదించాలని సలహా ఇచ్చాడు’ అని కుల్‌దీప్‌ అన్నాడు.

రవిచంద్రన్‌ అశ్విన్‌ సైతం తనకు కొన్ని సలహాలు ఇచ్చాడని కుల్‌దీప్‌ వివరించాడు. ‘కొన్నిసార్లు నేను బంతిని వేగంగా వేయాలని, నేరుగా విసరాలని, వ్యూహాత్మకంగా కొన్ని స్వల్ప మార్పులు చేసుకోవాలని యాష్‌ చెప్పాడు. కేవలం బౌలింగ్‌ పైనే కాదు వ్యూహాలపైనా అతడికి గొప్ప పట్టు ఉంది. ఆసీస్‌ సిరీసులో మేం ఇంగ్లాండ్‌ సిరీస్‌ ప్రణాళికల గురించి మాట్లాడుకున్నాం. ఒకవేళ జో రూట్‌ బ్యాటింగ్‌ చేస్తుంటే దగ్గరగా ఏ ఫీల్డర్‌ను ఉంచాలి, ఎక్కడ బౌలింగ్‌ చేయాలి వంటివి అడిగి తెలుసుకున్నా. బ్రిస్బేన్‌లో యాష్‌ ఆడనప్పుడు అతడితో చర్చించా’ అని తెలిపాడు.

ఇవీ చదవండి
ద్రవిడ్‌పై సచిన్‌ అలిగిన వేళ..!
చెపాక్‌ గడ్డ.. త్రిశతకాల అడ్డా!


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని