రాజస్థాన్‌ ఘన విజయం..

తాజా వార్తలు

Updated : 02/05/2021 20:08 IST

రాజస్థాన్‌ ఘన విజయం..

హైదరాబాద్‌ ఆరో ఓటమి

ఇంటర్నెట్‌డెస్క్‌: రాజస్థాన్‌ నిర్దేశించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 165/8 స్కోరుకే పరిమితమైంది. దాంతో 55 పరుగుల తేడాతో ఈ సీజన్‌లో ఆరో ఓటమి చవిచూసింది. ఈ నేపథ్యంలోనే ప్లేఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. భారీ లక్ష్య ఛేదనలో మనీశ్‌ పాండే(31; 20 బంతుల్లో 3x4, 2x6), జానీ బెయిర్‌స్టో(30; 21 బంతుల్లో 4x4, 1x6), కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌(20; 21 బంతుల్లో 1x4) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కాగా, తొలి వికెట్‌కు మనీశ్‌, బెయిర్‌ స్టో శుభారంభం అందించారు. ఆరు ఓవర్లకే 57 పరుగులు పరుగులు జోడించి బలమైన పునాది వేశారు. కానీ మిగతా బ్యాట్స్‌మెన్‌ పూర్తిగా విఫలమవడంతో సన్‌రైజర్స్‌కు ఓటమి తప్పలేదు. చివర్లో భువనేశ్వర్‌ కుమార్‌(14), సందీప్‌(8) నాటౌట్‌గా నిలిచి జట్టును ఆలౌట్‌ కాకుండా అడ్డుకున్నారు. రాజస్థాన్‌ బౌలర్లలో ముస్తాఫిజుర్‌, క్రిస్‌మోరిస్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టగా కార్తీక్‌ త్యాగి, రాహుల్‌ తెవాతియా చెరో వికెట్‌ తీశారు.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌(124; 64 బంతుల్లో 11x4, 8x6) శతకంతో చెలరేగాడు. అతడికి కెప్టెన్‌ సంజూ శాంసన్‌(48; 33 బంతుల్లో 4x4, 2x6) మంచి సహకారం అందించాడు. ఇద్దరూ రెండో వికెట్‌కు 150 పరుగులు జోడించారు. అంతకుముందు యువ ఓపెనర్‌ యశస్వి జైశ్వాల్‌(12) విఫలమయ్యాడు. జట్టు స్కోర్‌ 17 పరుగుల వద్ద రషీద్‌ఖాన్‌ బౌలింగ్‌లో వికెట్లముందు దొరికిపోయాడు. అనంతరం బట్లర్‌, సంజూ సన్‌రైజర్స్‌ బౌలర్లపై ఎదురుదాడి చేశారు. ముఖ్యంగా బట్లర్‌ ఆకాశమే హద్దుగా విధ్వంసం సృష్టించాడు. ఈ క్రమంలోనే 56 బంతుల్లో శతకం పూర్తి చేసి మరింత దూకుడుగా ఆడాడు. అయితే, సందీప్‌ శర్మ వేసిన 19వ ఓవర్‌లో చివరి బంతికి బౌల్డయ్యాడు. చివరికి రియాన్‌ పరాగ్‌(15), డేవిడ్‌ మిల్లర్‌(7) నాటౌట్‌గా నిలిచి సన్‌రైజర్స్‌ ముందు 221 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. హైదరాబాద్‌ బౌలర్లలో రషీద్‌, విజయ్‌ శంకర్‌, సందీప్‌ శర్మ తలా ఓ వికెట్‌ పడగొట్టారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని