Cricket News: శ్రేయస్‌ ఇంకా కోలుకోలేదు!

తాజా వార్తలు

Published : 20/07/2021 01:56 IST

Cricket News: శ్రేయస్‌ ఇంకా కోలుకోలేదు!

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ పునరాగమనం ఇంకా ఆలస్యమయ్యేలా ఉంది. అతడింకా భుజం గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. దాంతో ఈనెల 22 నుంచి ఆగస్టు 18 వరకు ఇంగ్లాండ్‌లో జరిగే లాంకషైర్‌ రాయల్‌ లండన్‌ కప్‌ టోర్నీలో పాల్గొనడం లేదని ఆ క్లబ్‌ నిర్వాహకులు ఒక ప్రకటనలో వెల్లడించారు. శ్రేయస్‌ ఈ ఏడాది మార్చిలో స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన ఒక వన్డేలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. బౌండరీకి వెళ్లే బంతిని ఆపే క్రమంలో అతడు డైవ్ చేస్తూ కిందపడ్డాడు. దాంతో ఎడమ భుజానికి గాయమైంది. ఆపై శస్త్రచికిత్స చేయించుకోగా అప్పటి నుంచి క్రికెట్‌కు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్‌ 14వ సీజన్‌లోనూ ఆడలేకపోయాడు. ఆ టోర్నీ కరోనా వైరస్‌ కేసులతో నిరవధికంగా వాయిదా పడింది.

ఈ క్రమంలోనే శ్రేయస్‌ ఇటీవల కోలుకున్నానని చెప్పాడు. పూర్తి ఫిట్‌నెస్‌ సాధించేందుకు వర్కవుట్లు చేస్తున్నానని తెలిపాడు. దాంతో త్వరలోనే క్రికెట్‌ ఆడాతానని ధీమాగా పేర్కొన్నాడు. కానీ, అతడింకా కోలుకోలేదని లాంకషైర్‌ క్లబ్‌ సోమవారం ప్రకటించింది. కాగా, దీనిపై స్పందించిన శ్రేయస్‌.. ఈసారి ఆ జట్టుతో ఆడకపోవడం బాధగా ఉందన్నాడు. ఎంతో చరిత్ర కలిగిన ఆ క్లబ్‌ తరఫున ఆడకపోవడం నిరాశ కలిగించిందని, భవిష్యత్‌లో ఎప్పుడైనా దానితో కలిసి ఆడతానని అన్నాడు. ఆ క్రికెట్‌ క్లబ్‌ డైరెక్టర్‌ పాల్‌ అలాట్‌ మాట్లాడుతూ.. శ్రేయస్‌ ఇంగ్లాండ్‌కు రాకపోవడం తమకు కూడా బాధ కలిగించిందని విచారం వ్యక్తం చేశాడు. అతడి కోసం ఎదురుచూస్తున్నామని చెప్పాడు. ఏదేమైనా ఈ యువ బ్యాట్స్‌మన్‌ పూర్తి ఫిట్‌నెస్‌తో క్షేమంగా ఉండాలనే కోరుకుంటున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని