
తాజా వార్తలు
స్మిత్ ఔట్: ఆసీస్ ఆధిక్యం 229
ఇంటర్నెట్డెస్క్: బ్రిస్బేన్ వేదికగా భారత్తో జరుగుతున్న ఆఖరి టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా అయిదో వికెట్ కోల్పోయింది. అర్ధశతకంం సాధించిన స్టార్ బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్ (55)ను సిరాజ్ బోల్తా కొట్టించాడు. బౌన్సర్ అంచనా వేయడంలో విఫలమైన స్మిత్ రహానె చేతికి చిక్కాడు. క్రీజులో గ్రీన్ (14*), పైన్ ఉన్నారు. కాగా, గ్రీన్-స్మిత్ అయిదో వికెట్కు 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 55 ఓవర్లకు ఆసీస్ స్కోరు 196/5. టీమిండియా కంటే 229 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఓవర్నైట్ స్కోరు 21/0తో ఆస్ట్రేలియా నాలుగో రోజు ఆట ఆరంభించిన సంగతి తెలిసిందే.
Tags :