సన్నీలో.. ఇంత ఆవేశమా?

తాజా వార్తలు

Published : 10/02/2021 18:34 IST

సన్నీలో.. ఇంత ఆవేశమా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: అంపైర్ల తప్పుడు నిర్ణయాలకు బలైన క్రికెటర్లు ఎందరో ఉన్నారు. ఆటలో సాంకేతికత ఎంత పెరిగినా ఇప్పటికీ వారు పొరపాట్లు పడుతూనే ఉంటారు. 1981లో ఆస్ట్రేలియాలో పర్యటించినప్పుడు టీమ్‌ఇండియాకు ఇలాంటి ఇబ్బందులే ఎదురయ్యాయి. అంతగా అనుభవం లేని రెక్స్‌ వైట్‌హెడ్‌ నిర్ణయాలతో కెప్టెన్‌ సునిల్‌ గావస్కర్‌ తీవ్ర ఆవేశానికి లోనయ్యాడు. ఒకానొక దశలో తన సహచరుడు చౌహాన్‌తో కలిసి వాకౌట్‌ చేసే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారడం గమనార్హం.

ఆసీస్‌ పేసర్‌ డెన్నిస్‌ లిల్లీతో సునిల్‌ గావస్కర్‌కు విపరీతమైన పోటీ ఉండేది. వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు నడిచేది. ఈ సిరీసులోనూ అలాంటిదే జరిగింది. మూడు మ్యాచుల సిరీసులో అప్పటికే ఆసీస్‌ 1-0తో ఆధిక్యంలో ఉంది. సన్నీ ఫామ్‌లో లేడు. దాంతో కీలకమైన మెల్‌బోర్న్‌ టెస్టులో నిలవాలని కంకణం కట్టుకున్నాడు. అందుకు తగ్గట్టే ఆడుతున్నాడు. 70 పరుగుల వద్ద ఉన్నప్పుడు లిల్లీ వేసిన బంతికి వికెట్ల ముందు దొరికిపోయాడు. అయితే ఆ బంతి బ్యాటు అంచుకు తగిలిందన్నది సన్నీ వాదన. అందుకు నిరాకరించిన అంపైర్ ‌మాత్రం ఔటిచ్చాడు.

తీవ్ర నిరాశకు గురైన సన్నీ ఔటవ్వలేదని అసహనం వ్యక్తం చేశాడు. ఇంతలోనే లిల్లీ ముందుకొచ్చి అశ్లీలంగా మాట్లాడాడు! దాంతో ఆవేశపడ్డ గావస్కర్‌ అవతలి ఎండ్‌లో ఉన్న సహచరుడు చౌహాన్‌ను తీసుకొని బయటకు వచ్చాడు. కానీ టీమ్‌ఇండియా మేనేజర్‌ చౌహాన్‌ను అడ్డుకొని మ్యాచ్‌ కొనసాగేలా చూశాడు. గావస్కర్‌ ఎల్బీపై సందిగ్ధం ఉన్నప్పటికీ అప్పటికే ఏడు తప్పుడు నిర్ణయాలు ఇచ్చిన వైట్‌హెడ్‌పై అసహనం ఇలా ప్రదర్శించాడని అంటారు. కొన్నాళ్ల తర్వాత అలా చేసుండాల్సింది కాదని సన్నీ ఒప్పుకోవడం గమనార్హం.

ఇవీ చదవండి
ఓటమిపై సాకులొద్దు.. పునఃసమీక్షించండి
రూట్‌ పైపైకి.. కోహ్లీ కిందకు..

 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని