
తాజా వార్తలు
తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమ్ఇండియా
బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా తొమ్మిది వికెట్లు కోల్పోయింది. వరుస ఓవర్లలో నవ్‌దీప్ సైని(5), వాషింగ్టన్ సుందర్(62) ఔటయ్యారు. తొలుత హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో సైని స్లిప్‌లో స్మిత్ చేతికి చిక్కడంతో భారత్ 320 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. తర్వాతి ఓవర్లోనే మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో సుందర్.. గ్రీన్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం మహ్మద్ సిరాజ్(6*), నటరాజన్ క్రీజులో ఉన్నారు. భారత్ 109 ఓవర్లకు 328/9తో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 41 పరుగుల వెనుకంజలో ఉంది.
ఇవీ చదవండి..
ఒక్క వికెట్ తీస్తేనేం..సిరాజ్ సూపర్: సచిన్
యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
Tags :