Team India: ప్రాక్టీస్‌ ప్రారంభించిన కోహ్లీసేన

తాజా వార్తలు

Published : 16/07/2021 22:16 IST

Team India: ప్రాక్టీస్‌ ప్రారంభించిన కోహ్లీసేన

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు ముందు టీమ్‌ఇండియా ఆటగాళ్లు డర్హమ్‌లో సాధన ప్రారంభించారు. ఆగస్టు 4 నుంచి కోహ్లీసేన నాటింగ్‌హామ్‌లో తొలి టెస్టు ఆడనున్న సంగతి తెలిసిందే. ఇది రెండో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో భారత్‌కు తొలి సిరీస్‌ కావడం విశేషం. ఇక 20 రోజుల విశ్రాంతి తర్వాత భారత ఆటగాళ్లు గురువారమే డర్హమ్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. దాంతో వారక్కడ బయోబుడగలోకి ప్రవేశించారు. ఈ క్రమంలోనే తొలి రోజు తేలిక పాటి సాధన చేస్తూ టీమ్‌ఇండియా క్రికెటర్లు చెమటోడ్చారు. అందుకు సంబంధించిన ఫోటోలను బీసీసీఐ ట్విటర్‌లో పంచుకుంది.

మరోవైపు గతనెల జరిగిన తొలి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో కోహ్లీసేన న్యూజిలాండ్‌ చేతిలో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు ముందు సుమారు 40 రోజుల విరామం దొరకడంతో జట్టు యాజమాన్యం ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చింది. దాంతో అందరూ బయోబుడగ నుంచి బయటకు వెళ్లి ఇంగ్లాండ్‌లోని పలు ప్రాంతాలను చుట్టేశారు. అదే సమయంలో యువ బ్యాట్స్‌మన్‌, వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌, త్రోలు విసిరే దయానంద్‌ కరోనా బారిన పడ్డారు. దాంతో వారిప్పుడు ప్రత్యేకంగా ఐసోలేషన్‌లో ఉన్నారు. వీరిద్దరికీ నెగెటివ్‌ వచ్చాకే జట్టుతో కలుస్తారని బీసీసీఐ స్పష్టం చేసింది. టీమ్‌ఇండియా ఈనెల 20 నుంచి కౌంటీ ఛాంపియన్‌షిప్‌ XI జట్టుతో మూడు రోజుల వార్మప్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టులకు ముందు ఇది వారికి ప్రాక్టీస్‌గా ఉపయోగపడనుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని