Tokyo Olympics: పతకాలు ముద్దాడుతూ హాకీ ఆటగాళ్ల భావోద్వేగం.. చూస్తారా!

తాజా వార్తలు

Published : 06/08/2021 07:37 IST

Tokyo Olympics: పతకాలు ముద్దాడుతూ హాకీ ఆటగాళ్ల భావోద్వేగం.. చూస్తారా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: హాకీలో నవ చరిత్రకు నాంది పలికింది భారత పురుషుల హాకీ జట్టు. ప్లేఆఫ్‌ మ్యాచులో జర్మనీని 5-4 తేడాతో ఓడించింది. కాంస్య పతకం కైవసం చేసుకుంది. ఈ విజయాన్ని అఖండ భారతావని ఆస్వాదించింది. మన్‌ప్రీత్‌ సేన ఆటను వేనోళ్ల పొగిడింది.

41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన భారత్‌ ఎంతో భావోద్వేగానికి గురైంది. ఆటగాళ్లు ఆనంద బాష్పాలు కార్చారు. ఐదేళ్ల తమ శ్రమకు తగిన ఫలితం దొరికిందని సంతోషించారు. కొవిడ్‌ మహమ్మారి కాలంలో ఎన్నో కష్టాలు అనుభవించినా చివరికి పతకం తేవడం ఆనందంగా ఉందని తెలిపారు.

భారత హాకీ ఆటగాళ్లు పతకాలు అందుకుంటున్న దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. యూట్యూబ్‌లో లక్షల సంఖ్యలో హాకీ విజయాన్ని అభిమానులు ఆస్వాదిస్తున్నారు. ముఖ్యంగా పతకాలు మెడలో వేసుకొనే సందర్భాలు భావోద్వేగాలు కలిగిస్తున్నాయి. ఆ వీడియోలు మీ కోసం..




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని