IPL 2021: వచ్చే ఏడాది ధోనీచెన్నైలో ఉంటాడా లేదా?

తాజా వార్తలు

Published : 17/10/2021 01:38 IST

IPL 2021: వచ్చే ఏడాది ధోనీచెన్నైలో ఉంటాడా లేదా?

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌ 14వ సీజన్‌ ముగిసింది. ఎప్పటిలాగే పాత జట్టే విజేతగా నిలిచింది. ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ నాలుగోసారి టైటిల్‌ ఎగరేసుకుపోయింది. ఇక ఇప్పుడు అందరి దృష్టీ టీ20 ప్రపంచకప్‌పైనే పడింది. అయితే, వచ్చే ఏడాది ఈ మెగా ప్రీమియర్‌ లీగ్‌లో చెన్నై సారథి మహేంద్రసింగ్‌ ధోనీ ఆడతాడా లేదా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే గతేడాది అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికిన ధోనీ.. ఇకపై చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున బరిలోకి దిగుతాడా లేదా అనేది తేలాల్సిఉంది.

ఇక కోల్‌కతాపై విజయం సాధించిన అనంతరం ధోనీ మాట్లాడుతూ తన భవితవ్యంపై స్పందించాడు. ఈ విషయంపై తాను ఇదివరకే స్పష్టత ఇచ్చానని చెప్పాడు. ఇకపై అంతా బీసీసీఐ తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడిందన్నాడు. వచ్చే ఏడాది ఐపీఎల్‌లో మరో రెండు కొత్త జట్లు పాల్గొంటున్న నేపథ్యంలో చెన్నై జట్టుకు ఉపయోగకరమైన నిర్ణయాలు తీసుకోవాలన్నాడు. తాను జట్టులో ఉంటానా లేదా అనేది ముఖ్యం కాదని, బలమైన చెన్నై సూపర్‌ కింగ్స్‌ను తీర్చిదిద్దడమే ముఖ్యమని చెప్పాడు. మరో పదేళ్లు ఈ జట్టును నడిపించే ఆటగాళ్లను వెతికిపట్టుకోవాలని ధోనీ స్పష్టంచేశాడు. కాగా, 2022 ఐపీఎల్‌ కోసం త్వరలోనే మెగా వేలం పాట జరగనుంది. ఇప్పటికే ఉన్న ఎనిమిది ఫ్రాంఛైజీలు కేవలం ఇద్దరు ఆటగాళ్లనే అట్టిపెట్టుకోవాలని టోర్నీ నిర్వాహకులు తెలిపారు. దీంతో ఏయే జట్టులో ఎవరెవరు ఉంటారో.. ఎవరెవరు మారతారో వేచిచూడాలి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని