MS Dhoni: కర్ణశర్మ, దీపక్‌ చాహర్‌కు ఫుట్‌బాల్‌ పోటీ పెట్టిన ఎంఎస్‌ ధోనీ.. గెలిచిందెవరంటే?

తాజా వార్తలు

Published : 29/08/2021 01:27 IST

MS Dhoni: కర్ణశర్మ, దీపక్‌ చాహర్‌కు ఫుట్‌బాల్‌ పోటీ పెట్టిన ఎంఎస్‌ ధోనీ.. గెలిచిందెవరంటే?

ఇంటర్నెట్‌ డెస్క్‌: చెన్నై సూపర్‌కింగ్స్‌ సారథి ఎంఎస్‌ ధోనీకి ఫుట్‌బాల్‌ అంటే ఎంతిష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు! క్రికెట్‌ మ్యాచులకు సిద్ధమయ్యే ముందు అతడు ఫుట్‌బాల్‌ ఆడుతుంటాడు. ఏటా బాలీవుడ్‌ తారలతో కలిసి ఓ ధార్మిక మ్యాచులోనూ మెరుస్తుంటాడు.

ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న క్రికెటర్లు మినహా ప్రస్తుతం సీఎస్‌కే బృందమంతా యూఏఈలోనే ఉంది. క్వారంటైన్‌ పూర్తవ్వడంతో ఐపీఎల్‌ రెండో దశకు సిద్ధమవుతోంది. ఆటగాళ్లు రోజూ కసరత్తులు చేస్తున్నారు. నెట్స్‌లో విపరీతంగా శ్రమిస్తున్నారు. అంతేకాకుండా మైదానంలో సరదాగా గడుపుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ఎంఎస్‌ ధోనీ శుక్రవారం రాత్రి ఫుట్‌బాల్‌ ఆర్కెస్ట్రేటర్‌గా మారాడు. స్పిన్నర్‌ కర్ణ్‌శర్మ, పేసర్‌ దీపక్‌ చాహర్‌ మధ్య ‘2 టచెస్‌ 7 పాయింట్స్‌’ ఫుట్‌బాల్‌ పోటీ నిర్వహించాడు. ఆటకు సంబంధించిన నియమాలను వారికి వివరించాడు. పోటీలో మొదట వరుస పాయింట్లు సాధించి తర్వాత వెనకబడ్డ కర్ణశర్మకు సలహాలు సైతం ఇవ్వడం గమనార్హం.  ఈ పోటీకి సంబంధించిన వీడియోను చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని