Williamson: కోహ్లీని ఎందుకు కౌగిలించుకున్నానంటే!

తాజా వార్తలు

Updated : 29/06/2021 10:58 IST

Williamson: కోహ్లీని ఎందుకు కౌగిలించుకున్నానంటే!

కొన్నేళ్లుగా తామిద్దరం మిత్రులమన్న కేన్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ తాను సహచరులమని న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ అంటున్నాడు. తామిద్దరం సుదీర్ఘ కాలంగా సన్నిహిత మిత్రులమని పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో స్నేహబంధాలు కొనసాగుతాయని వెల్లడించాడు.

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో టీమ్‌ఇండియా, న్యూజిలాండ్‌ హోరాహోరీగా తలపడ్డాయి. వర్షం కారణంగా రిజర్వు డేకు చేరుకున్న మ్యాచులో కేన్‌ సేన 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గెలుపు షాట్‌ కొట్టిన రాస్‌టేలర్‌ను అభినందించిన విలియమ్సన్‌ నేరుగా కోహ్లీ వద్దకు వచ్చి కౌగిలించుకున్నాడు. తామిద్దరం సహచరులం కావడంతోనే అలా చేశానని అంటున్నాడు.

‘విరాట్‌, నేను చాలాకాలంగా ఒకరికొకరం తెలుసు. అంతేకాకుండా మేమిద్దరం సహచరులం. క్రీడల వల్ల ప్రపంచ వ్యాప్తంగా చాలామందిని కలిసే అవకాశం దొరుకుతుంది. అంతేకాకుండా భిన్నమైన స్నేహ బంధాలు లభిస్తాయి. కలిసి ఆడుతున్నా.. ఎదురెదురుగా తలపడుతున్నా భిన్నమైన అనుభవాలు ఎదురవుతాయి. కొన్నిసార్లు ఇద్దరి ఆసక్తులు, ఇష్టాయిష్టాలు ఒకేలా ఉంటాయి’ అని కేన్‌ విలియమ్సన్‌ అన్నాడు. ఒక మ్యాచులో ఓడిపోయినంత మాత్రాన టీమ్‌ఇండియాను తక్కువ అంచనా వేయొద్దని.. అది బలమైన జట్టని పేర్కొన్న సంగతి తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని