KL Rahul: ధోనీ కోసం తుపాకీ గుండుకు ఎదురెళ్తా!

తాజా వార్తలు

Published : 03/07/2021 10:29 IST

KL Rahul: ధోనీ కోసం తుపాకీ గుండుకు ఎదురెళ్తా!

కోహ్లీ 200 శాతం కష్టించే కెప్టెన్‌: కేఎల్‌ రాహుల్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎంఎస్‌ ధోనీ కోసం తుపాకీ గుండుకు ఎదురెళ్తానని టీమ్‌ఇండియా స్ట్రోక్‌ ప్లేయర్‌ కేఎల్‌ రాహుల్‌ అంటున్నాడు. అందుకోసం రెండో ఆలోచనే చేయనని చెబుతున్నాడు. జట్టు సభ్యులు అతడికెంతో గౌరవం ఇస్తారని వెల్లడించాడు. ఆటగాళ్ల సామర్థ్యం మెరుగుపర్చడంలో విరాట్‌ కోహ్లీకి తిరుగులేదని తెలిపాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న రాహుల్‌ మీడియాతో మాట్లాడాడు.

‘ఎవరైనా కెప్టెన్‌ గురించి అడిగారంటే మా తరానికి వెంటనే గుర్తొచ్చేది ఎంఎస్‌ ధోనీ. మేమందరం అతడి సారథ్యంలోనే ఆడాం. అవును, అతడెన్నో టోర్నీలు గెలిచాడు. దేశం కోసం ఐసీసీ టోర్నీలు, ట్రోఫీలు అందించాడు. నా దృష్టిలో మాత్రం ఒక నాయకుడిగా జట్టు సభ్యుల గౌరవం దక్కించుకోవడమే అతిపెద్ద ఘనత’ అని రాహుల్‌ అన్నాడు.

‘మీకో విషయం చెబుతాను. అతడి కోసం తుపాకీ గుండుకు ఎదురెళ్లమంటే మరో ఆలోచన లేకుండా వెళ్తాం. మహీ నుంచి నేను ఎన్నో నేర్చుకున్నాను. ఒడుదొడుకులు ఎదురైనా ఒదిగి ఉండటాన్ని అతడి నుంచే తెలుసుకున్నా. దేశం కోసం అతడు జట్టును నడిపించిన తీరు అద్భుతం’ అని కేఎల్‌ తెలిపాడు.

టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ అంకితభావం, అభిరుచికి తిరుగులేదని రాహుల్‌ అన్నాడు. ‘నేనిప్పుడు విరాట్‌ సారథ్యంలో ఆడుతున్నాను. అతడో భిన్నమైన కెప్టెన్‌. వ్యక్తిగతంగా ఎంతో అంకితభావంతో ఉంటాడు. అందరూ వంద శాతం కష్టపడితే అతడు 200 శాతం శ్రమిస్తాడు. అంతేకాకుండా.. జట్టు సభ్యులంతా 100 నుంచి 200 శాతం కష్టపడేలా చేసే నమ్మశక్యం కాని సామర్థ్యం అతడి సొంతం’ అని వెల్లడించాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని