జట్టంతా భావోద్వేగానికి గురైన క్షణమది: శార్దూల్‌

తాజా వార్తలు

Published : 28/01/2021 01:18 IST

జట్టంతా భావోద్వేగానికి గురైన క్షణమది: శార్దూల్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: గబ్బా టెస్టు విజయానంతరం దేశం తరఫున జాతీయ జెండా చేతబూని మైదానంలో తిరుగుతున్న క్షణాన జట్టు సభ్యులంతా భావోద్వేగానికి గురయ్యారని టీమిండియా ఆటగాడు శార్దూల్‌ ఠాకూర్ తెలిపాడు. ఎన్నో క్లిష్ట పరిస్థితుల నడుమ కంగారూల గడ్డపై టెస్టు సిరీస్‌ను సాధించామని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్‌ 2-1 తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

‘‘విజయానంతరం జాతీయ జెండాను చేతబూని మైదానంలో తిరిగినప్పుడు ఎంతో భావోద్వేగానికి గురయ్యాను. ఆ క్షణాన జట్టు సభ్యులంతా ఎంతో భావోద్వేగం చెందారు. ఆస్ట్రేలియాలోనూ ఎంతో మంది భారతీయులు మాకు మద్దతుగా నిలిచారు. స్టేడియానికి వచ్చి ప్రోత్సహించారు. వారికి ధన్యవాదాలు తెలపడం మా బాధ్యత. మైదానంలో అభివాదం చేస్తూ వాళ్లకి కృతజ్ఞతలు తెలిపాం. వాళ్లకే కాదు, మేం విజయం సాధించాలని కాంక్షించిన అందరీకి ధన్యవాదాలు చెప్పాం. ఇక సిరీస్‌ను 2-1తో ముగించడం ఎంతో ప్రత్యేకం. ప్రత్యర్థి జట్టుకు డెన్‌గా భావించే గబ్బాలో విజయం సాధించి విమర్శకుల నోళ్లు మూయించాం. ఇది గొప్ప అనుభూతి’’ అని శార్దూల్‌ అన్నాడు.

‘‘అడిలైట్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే ఆలౌటయ్యాం. అంతేగాక కోహ్లీ గైర్హాజరీ. దీంతో మేం 0-4తో సిరీస్ కోల్పోతామని భావించారంతా. కానీ గొప్పగా పుంజుకుని మెల్‌బోర్న్‌ టెస్టులో విజయం సాధించాం. రహానె కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆ తర్వాత అద్భుత పోరాటంతో సిడ్నీ టెస్టును డ్రాగా ముగించాం. అది మాకు విజయంతో సమానం. ఇక గబ్బాలో చరిత్ర సృష్టించాం. ఆ క్షణాల్ని ఎంతో ఆస్వాదించాం’’ అని శార్దూల్ పేర్కొన్నాడు. గబ్బా టెస్టులో శార్దూల్ అర్ధశతకం సాధించడంతో పాటు ఏడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

ఇదీ చదవండి

రూట్‌.. రైట్‌ రైట్‌! కోహ్లీ ఆపగలడా?

ప్లాన్లేమీ లేవ్‌‌..బయటికొచ్చి బాదడమే: శార్దూల్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని