WTC Final: అరగంట ముందు జల్లులు మొదలు

తాజా వార్తలు

Published : 22/06/2021 15:19 IST

WTC Final: అరగంట ముందు జల్లులు మొదలు

ఆలస్యంగా ఆరంభం కానున్న ఐదోరోజు ఆట

సౌథాంప్టన్‌: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ను వరుణ దేవుడు విడిచిపెట్టేలా లేడు. ఐదో రోజు ఆట ఆరంభానికి సరిగ్గా 20 నిమిషాల ముందు చిరు జల్లులు కురువడం మొదలైంది. దాంతో మైదానం సిబ్బంది వెంటనే పిచ్‌పై కవర్లు కప్పారు. నిన్నటితో పోలిస్తే మంగళవారం వాతావరణం మెరుగ్గానే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. చిరు చినుకులే కావడంతో పూర్తి ఆట సాధ్యమవుతుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. స్థానిక కాలమానం ప్రకారం 11 గంటలకు ఆట ఆరంభం అవుతుందని అంటున్నారు.

భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న ఫైనల్లో గెలుపు ఎవరిని వరిస్తుందో అర్థం కావడం లేదు. ఐదు రోజుల నుంచి సౌథాంప్టన్‌లో వర్షం పడటమే ఇందుకు కారణం. వరుణుడి వల్ల తొలిరోజు పూర్తిగా మ్యాచ్‌ జరగలేదు. రెండో రోజు 64.4 ఓవర్ల ఆట సాధ్యమైంది. ఆ రోజు టీమ్‌ఇండియా ఆధిపత్యం సాధించింది. మూడో రోజు మాత్రం కివీస్‌దే పైచేయి. భారత్‌ను 217కు ఔట్‌ చేయడమే కాకుండా 101/2తో నిలిచింది. నాలుగోరోజు, సోమవారం నిరంతరాయంగా వర్షం కురవడంతో ఆట మొత్తంగా సాధ్యపడలేదు. మరి మంగళవారమైనా ఆట సవ్యంగా సాగుతుందో లేదో చూడాలి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని