close
షార్ప్‌షూటర్స్‌ శుభారంభం

సి.యాదయ్య స్మారక బాస్కెట్‌బాల్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: సి.యాదయ్య స్మారక బాస్కెట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌లో షార్ప్‌షూటర్స్‌ జట్టు శుభారంభం చేసింది. శనివారం సిటీ కళాశాల మైదానంలో జరిగిన మ్యాచ్‌లో షార్ప్‌షూటర్స్‌ 32-18 తేడాతో సన్‌రైజర్స్‌పై విజయం సాధించింది. మ్యాచ్‌ ఆరంభంలో షార్ప్‌షూటర్స్‌ వెనకబడింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి 12-14తో నిలిచింది. ఐతే విరామం తర్వాత పుంజుకొన్న ఆ జట్టు ప్రత్యర్థిపై ఆధిపత్యం చలాయించింది. షార్ప్‌షూటర్స్‌ జట్టులో మణిదీప్‌ (10), వినీత్‌ (8), ఈశ్వర్‌ (8).. సన్‌రైజర్స్‌ తరపున రోహన్‌ (6), నిపుణ్‌ (6) రాణించారు. మరో మ్యాచ్‌లో లాకర్స్‌ 54-37తో రోవర్స్‌పై గెలిచింది. లాకర్స్‌ తరపున క్షేత్ర (17), ఆకాశ్‌ (15).. రోవర్స్‌ జట్టులో మహేశ్‌ (19), తరుణ్‌ (9) ఆకట్టుకున్నారు. మిగతా మ్యాచ్‌ల్లో మహింద్రహిల్స్‌ 35-24తో వారియర్స్‌పై, ఫాక్స్‌స్టార్స్‌ 43-34తో మైహోమ్‌ జువల్‌పై జయకేతనం ఎగురవేశాయి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.