Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 179419
            [news_title_telugu_html] => 

అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు..

[news_title_telugu] => అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు.. [news_title_english] => [news_short_description] => విజయం ఖాయమనుకున్న ఆస్ట్రేలియాకు షాక్‌. బెన్‌ స్టోక్స్‌ (135 నాటౌట్‌; 219 బంతుల్లో 11×4, 8×6) చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్‌ ఆడిన వేళ. ఆదివారం, నాలుగో రోజు అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన యాషెస్‌ మూడో టెస్టులో ఒక్క వికెట్‌ తేడాతో ఇంగ్లాండ్‌ గెలిచింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. స్టోక్స్‌ రాణించడంతో లక్ష్యాన్ని ఇంగ్లాండ్‌ 9 వికెట్లు కోల్పోయి ఛేదించింది. టెస్టు క్రికెట్లో ఇంగ్లాండ్‌కు ఇదే అత్యధిక లక్ష్యఛేదన.... [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [news_sections] => ,4, ) )
అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు.. - EENADU
close
అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు..

ఇంగ్లాండ్‌ అద్భుత విజయం
మూడో టెస్టులో ఆసీస్‌ అనూహ్య ఓటమి
స్టోక్స్‌ అసమాన పోరాటం
లీడ్స్‌

అద్భుతం.. అమోఘం... అద్వితీయం.. అతడి ఇన్నింగ్స్‌ను ఎంత పొగిడినా తక్కువే! ప్రపంచకప్పులో తన జట్టుకు ఒంటి చేత్తో విజయాన్నందించిన అతడి చిరస్మరణీయ పోరాటం అభిమానుల్లో స్మృతిలో ఇంకా తాజాగా ఉండగానే బెన్‌ స్టోక్స్‌ మళ్లీ అద్భుతం చేశాడు. క్రికెట్‌ ప్రపంచంతో ఔరా అనిపిస్తూ.. ఉత్కంఠను జయిస్తూ అసమాన పోరాటంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. యాషెస్‌ మూడో టెస్టులో ఇంగ్లాండ్‌కు అపురూప విజయాన్నందిచాడు. మామూలు పోరాటమా అది! 286/9. 359 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్‌ స్కోరిది. ఆఖరి ఇంగ్లాండ్‌ అభిమాని కూడా కలలోనైనా ఊహించి ఉండడు తమ జట్టు గెలుస్తుందని! కానీ స్టోక్స్‌ (135 నాటౌట్‌) కలకాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియాకు షాకిచ్చాడు. ఆఖరి బ్యాట్స్‌మన్‌ లీచ్‌ను కాపాడుకుంటూ, కంగారూలను దిగ్భ్రాంతికి గురి చేస్తూ లక్ష్యాన్ని ఛేదించేశాడు.

విజయం ఖాయమనుకున్న ఆస్ట్రేలియాకు షాక్‌. బెన్‌ స్టోక్స్‌ (135 నాటౌట్‌; 219 బంతుల్లో 11×4, 8×6) చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్‌ ఆడిన వేళ. ఆదివారం, నాలుగో రోజు అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన యాషెస్‌ మూడో టెస్టులో ఒక్క వికెట్‌ తేడాతో ఇంగ్లాండ్‌ గెలిచింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. స్టోక్స్‌ రాణించడంతో లక్ష్యాన్ని ఇంగ్లాండ్‌ 9 వికెట్లు కోల్పోయి ఛేదించింది. టెస్టు క్రికెట్లో ఇంగ్లాండ్‌కు ఇదే అత్యధిక లక్ష్యఛేదన. లీచ్‌ (17 బంతుల్లో 1 నాటౌట్‌) ఒక్క పరుగే చేసినా ఒత్తిడిలో.. స్టోక్స్‌కు గొప్పగా సహకరించాడు. అతడితో అభేద్యమైన ఆఖరి వికెట్‌కు స్టోక్స్‌ 76 పరుగులు జోడించాడు.

వారెవ్వా స్టోక్స్‌: 359 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్‌నైట్‌ స్కోరు 156/3తో ఆదివారం ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లాండ్‌.. కాసేపటికే రూట్‌ వికెట్‌ను కోల్పోయినా స్టోక్స్‌కు బెయిర్‌స్టో (36) అండగా నిలవడంతో ఓ దశలో 245/4తో మెరుగ్గానే కనిపించింది. కానీ చకచకా ఐదు వికెట్లు కోల్పోయి 286/9కు పరిమితమైంది. ఇంగ్లాండ్‌ ఓటమి లాంఛనమే అనుకున్నారంతా! కానీ స్టోక్స్‌ పోరాడితే పోయేదేమీ లేదనుకుని రెచ్చిపోయాడు. ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించిన అతడు.. వీలైనంత వరకు చివరి బంతికి పరుగు తీస్తూ, టెయిలెండర్‌ లీచ్‌ను కాపాడుకుంటూ సాగిపోయాడు. అతడు అలవోకగా సిక్స్‌లు, ఫోర్లు బాదుతుంటే ఇంగ్లాండ్‌ వడివడిగా లక్ష్యం దిశగా సాగింది. పేసర్లు ప్యాటిన్సన్‌, కమిన్స్‌, హేజిల్‌వుడ్‌లను గానీ, స్పిన్నర్‌ లైయన్‌ను గానీ స్టోక్స్‌ వదిలిపెట్టలేదు. హేజిల్‌వుడ్‌ ఓవర్లోనైతే వరుసగా 6, 6, 4 బాదేశాడు. లీచ్‌ ఉత్కంఠను తట్టుకుంటూ మొండిగా నిలబడ్డాడు. ఇంగ్లాండ్‌ లక్ష్యానికి చేరువవుతున్న కొద్దీ ఉత్కంఠ తీవ్రమైపోయింది. 357 వద్ద లీచ్‌ ఓవర్‌ మొదటి నుంచీ బ్యాటింగ్‌ చేయాల్సి వచ్చింది. ఎట్టకేలకు మూడో బంతికి అతడు సింగిల్‌ తీయడంతో స్కోరు సమంమైంది. వెంటనే స్టోక్స్‌ ఫోర్‌తో చరిత్రాత్మక విజయం ఇంగ్లాండ్‌ సొంతమైంది.

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 179
ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 67
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌: 246
ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌: 362/9

ఈ మ్యాచ్‌లో విజయానికి ఇంగ్లాండ్‌ సంపూర్ణ అర్హురాలే. కానీ అదృష్టం కూడా ఎట్టిపరిస్థితుల్లో ఇంగ్లాండ్‌ను గెలిపించాలని కంకణం కట్టుకున్నట్లుంది. ఇంగ్లాండ్‌ స్కోరు 342 వద్ద కమిన్స్‌ బౌలింగ్‌లో స్టోక్స్‌ ఇచ్చిన క్యాచ్‌ను హారిస్‌ చేజార్చాడు. 357 వద్ద లీచ్‌ను అత్యంత తేలిగ్గా రనౌట్‌ చేసే అవకాశాన్ని లైయన్‌ వదిలేశాడు. అదే స్కోరు వద్ద స్టోక్స్‌ ఎల్బీ కోసం లైయన్‌ చేసిన అప్పీలును అంపైర్‌ విల్సన్‌ తిరస్కరించాడు. అప్పటికీ ఆసీస్‌కు సమీక్షలు అయిపోయాయి. ఉండుంటే స్టోక్స్‌ ఔటయ్యేవాడే.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.