close
హర్షిల్‌ విజృంభణ

ఎ-డివిజన్‌ వన్డే లీగ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్నేషనల్‌ సీసీ, యూనివర్సల్‌ సీసీ జట్ల మధ్య జరిగిన ఎ3-డివిజన్‌ వన్డే లీగ్‌ క్రికెట్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన యూనివర్సల్‌ సీసీ 48.5 ఓవర్లలో 285 పరుగులు చేసింది. హర్షిత్‌ సాయి (52), షేక్‌ ముదస్సిర్‌ (78), ప్రతీక్‌ (66) అర్ధ సెంచరీలతో రాణించారు. ఇంటర్నేషనల్‌ బౌలర్‌ హర్షిల్‌ మిశ్రా (5/29) ఐదు వికెట్లతో విజృంభించాడు. అనంతరం ఇంటర్నేషనల్‌ సీసీ 18.4 ఓవర్లలో 3 వికెట్లకు 81 పరుగులు చేసింది. ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు.

* యూనివర్సల్‌ సీసీ: 285 (ఆదిత్య 36, హర్షిత్‌ సాయి 52, షేక్‌ ముదస్సిర్‌ 78, ప్రతీక్‌ 66, హర్షిల్‌ మిశ్రా 5/29), ఇంటర్నేషనల్‌ సీసీ: 81/3 (సాయి అక్షత్‌రెడ్డి నాటౌట్‌ 33), * ఎంసీసీ: 123 (శ్రీనివాస్‌యాదవ్‌ 54, సుశిక్షిత్‌రెడ్డి 5/41), పీకేఎంసీసీ: 46, * ఎపెక్స్‌ సీసీ: 192 (వినీత్‌ 49, రామకృష్ణ 48, మహ్మద్‌ జాక్‌ 5/68) వర్సెస్‌ నల్గొండ జిల్లా.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.