close
అఫ్గాన్‌దే టీ20 సిరీస్‌

లఖ్‌నవూ: వెస్టిండీస్‌తో మూడు టీ20ల సిరీస్‌ను  అఫ్గానిస్థాన్‌ 2-1తో కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఆఖరిదైన మూడో మ్యాచ్‌లో ఆ జట్టు 29 పరుగుల తేడాతో విండీస్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన అఫ్గాన్‌ జట్టు.. 20 ఓవర్లలో 8 వికెట్లకు 156 పరుగులు చేసింది. రహ్మనుల్లా గుర్బాజ్‌ (79; 52 బంతుల్లో 6×4, 5×6) రాణించాడు. కాట్రెల్‌, క్రిక్‌ విలియమ్స్‌, కీమో పాల్‌ తలా రెండేసి వికెట్లు తీశారు. నవీన్‌ ఉల్‌ హక్‌ (3/24) విజృంభించడంతో విండీస్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 127 పరుగులే చేయగలిగింది. ఈ రెండు జట్ల మధ్య ఏకైక టెస్టు లఖ్‌నవూ వేదికగా ఈనెల 27న ప్రారంభం కానుంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.