close

ప్రధానాంశాలు

Updated : 18/10/2020 04:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అయ్యో చెన్నై

సూపర్‌కింగ్స్‌ను ముంచిన చివరి ఓవర్‌
మ్యాచ్‌ను ఎగరేసుకుపోయిన దిల్లీ
ధావన్‌ వీరోచిత శతకం
షార్జా

పాపం చెన్నై సూపర్‌కింగ్స్‌! శనివారం రాత్రి ఆ జట్టు ఓడిన తీరుకు జాలి పడకుండా ఉండలేం. చివరి ఓవర్లో 17 పరుగులు కావాలి. అలసిన ధావన్‌ షాట్లు ఆడలేకపోతున్నాడు. అక్షర్‌ పటేల్‌ అప్పుడే క్రీజులోకొచ్చాడు. ఇలాంటి స్థితిలో బౌలింగ్‌ చేయడంలో ఎంతో అనుభవమున్న బ్రావో వచ్చి చెన్నైని గెలిపించేస్తాడని అంతా అనుకున్నారు. కానీ బంతి జడేజా చేతికిచ్చాడు ధోని. చివరి ఓవర్లో స్పిన్‌ వరంలా కలిసి రావడంతో దొరికిన బంతిని దొరికినట్లు స్టాండ్స్‌లోకి పంపించి దిల్లీని గెలిపించాడు అక్షర్‌. బ్రావో అస్వస్థతతో చివర్లో మైదానాన్ని వీడటం చెన్నై కొంపముంచింది. టీ20ల్లో సెంచరీనే అరుదంటే.. ధావన్‌ ఛేదనలో, ఒత్తిడి మధ్య 100 కొట్టి ఈ మ్యాచ్‌ హీరోగా నిలిచాడు.

పీఎల్‌-13లో చెన్నై సూపర్‌కింగ్స్‌ తడబాటు కొనసాగుతోంది. శనివారం దిల్లీ ఆ జట్టును 5 వికెట్ల తేడాతో ఓడించింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ శిఖర్‌ ధావన్‌ (101 నాటౌట్‌; 58 బంతుల్లో 14×4, 1×6) సంచలన శతకానికి.. అక్షర్‌ పటేల్‌ (21 నాటౌట్‌; 5 బంతుల్లో 3×6) మెరుపులు తోడవడంతో 180 పరుగుల లక్ష్యాన్ని క్యాపిటల్స్‌ 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మొదట డుప్లెసిస్‌ (58; 47 బంతుల్లో 6×4, 2×6), అంబటి రాయుడు (45 నాటౌట్‌; 25 బంతుల్లో 1×4, 4×6), జడేజా (33 నాటౌట్‌; 13 బంతుల్లో 4×6) సత్తా చాటడంతో చెన్నై 4 వికెట్లకు 179 పరుగులు చేసింది. 9 మ్యాచ్‌ల్లో ఆరో ఓటమి చవిచూసిన చెన్నై, ప్లేఆఫ్‌ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకోగా.. అన్నే మ్యాచ్‌లాడిన దిల్లీ ఏడో విజయంతో ప్లేఆఫ్‌కు చేరువైంది.
మూడుసార్లు ధావన్‌ను బతికించి..: చివర్లో మెరుపు షాట్లతో గెలిపించింది అక్షర్‌ పటేలే అయినా.. దిల్లీని అక్కడిదాకా లాక్కొచ్చింది ధావనే. షా (0) తొలి ఓవర్లోనే వెనుదిరిగినా.. రహానె (8) వైఫల్యాన్ని కొనసాగించినా.. కాసేపు సహకరించిన అయ్యర్‌ (23), స్టాయినిస్‌ (24) కీలక సమయంలో ఔటైపోయినా.. ధావన్‌ మాత్రం మెరుపు షాట్లతో దిల్లీ ఛేదనను నడిపించాడు. అయితే ధావన్‌ 21, 50, 79 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్‌లను చెన్నై ఆటగాళ్లు విడిచిపెట్టారు. ఈ అవకాశాల్ని ఉపయోగించుకుని అతను సెంచరీ కొట్టేశాడు. అయితే అతను 19వ ఓవర్లో శతకం పూర్తి చసే సమయానికి దిల్లీ గెలిచే స్థితిలోనే లేదు. 19వ ఓవర్‌ తొలి బంతికి కేరీ (4)ను ఔట్‌ చేసిన సామ్‌ కరన్‌.. చక్కటి బంతులతో ధావన్‌ను కట్టడి చేశాడు.  ఆ ఓవర్లో 4 పరుగులే వచ్చాయి. ఈ ఓవర్లో 4 బంతులాడి ధావన్‌ చేసింది 2 పరుగులే. కానీ బ్రావో లేకపోవడంతో చివరి ఓవర్‌ను జడేజా వేయగా.. రెండో బంతికి స్ట్రైక్‌కు వచ్చిన అక్షర్‌ వరుసగా  6, 6 బాదాడు. స్కోర్లు సమమయ్యాక అయిదో బంతికి మరో సిక్సర్‌ అందుకోవడంతో చెన్నై పనైపోయింది.

ఆఖరి మెరుపులతో..: గత మ్యాచ్‌ చివర్లో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి మ్యాచ్‌ను చెన్నై వైపు లాగేసిన జడేజా.. మరోసారి అలాంటి ఇన్నింగ్సే ఆడటంతో సీఎస్‌కే అనూహ్యమైన స్కోరు చేయగలిగింది. రాయుడుతో కలిసి అతను అభేద్యమైన అయిదో వికెట్‌కు 27 బంతుల్లోనే 50 పరుగులు జోడించారు. తొలి పది ఓవర్ల వరకు చెన్నై ఇన్నింగ్స్‌లో పెద్దగా మెరుపుల్లేవు. మరోసారి ఓపెనర్‌గా వచ్చిన సామ్‌ కరన్‌ (0) తొలి ఓవర్లోనే వెనుదిరగ్గా.. వాట్సన్‌ (36; 28 బంతుల్లో 6×4), డుప్లెసిస్‌ జోడీ అనుకున్నంత వేగంగా ఆడలేకపోయారు. 13 ఓవర్లకు చెన్నై స్కోరు 94 పరుగులే. అయితే డుప్లెసిస్‌, ధోని (3) ఔటయ్యాక వచ్చిన జడేజా.. రాయుడుతో కలిసి చెన్నైకి భారీ స్కోరు సాధించి పెట్టాడు.


చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇన్నింగ్స్‌: కరన్‌ (సి) నార్జ్‌ (బి) దేశ్‌పాండే 0; డుప్లెసిస్‌ (సి) ధావన్‌ (బి) రబాడ 58; వాట్సన్‌ (బి) నార్జ్‌ 36; రాయుడు నాటౌట్‌ 45; ధోని (సి) కేరీ (బి) నార్జ్‌ 3; జడేజా నాటౌట్‌ 33; ఎక్స్‌ట్రాలు 4 మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 179; వికెట్ల పతనం: 1-0, 2-87, 3-109, 4-129; బౌలింగ్‌: తుషార్‌ దేశ్‌పాండే 4-0-39-1; రబాడ 4-1-33-1; అక్షర్‌ పటేల్‌ 4-0-23-0; నార్జ్‌ 4-0-44-2; అశ్విన్‌ 3-0-30-0; స్టాయినిస్‌ 1-0-10-0
దిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: పృధ్వీ షా (సి) అండ్‌ (బి) దీపక్‌ 0; ధావన్‌ నాటౌట్‌ 101; రహానె (సి) కరన్‌ (బి) దీపక్‌ 8; శ్రేయస్‌ (సి) డుప్లెసిస్‌ (బి) బ్రావో 23; స్టాయినిస్‌ (సి) రాయుడు (బి) శార్దూల్‌ 24; కేరీ (సి) డుప్లెసిస్‌ (బి) కరన్‌ 4; అక్షర్‌ నాటౌట్‌ 21; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం: (19.5 ఓవర్లలో 5 వికెట్లకు) 185; వికెట్ల పతనం: 1-0, 2-26, 3-94, 4-137, 5-159; బౌలింగ్‌: దీపక్‌ 4-1-18-2; కరన్‌ 4-0-35-1; శార్దూల్‌ 4-0-39-1; జడేజా 1.5-0-35-0; కర్ణ్‌శర్మ 3-0-34-0; బ్రావో 3-0-23-1



Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.