పంకజ్‌ 24వ సారి
Array ( ) 1

ప్రధానాంశాలు

Published : 22/09/2021 03:06 IST

పంకజ్‌ 24వ సారి

ప్రపంచ టైటిల్‌ సొంతం

దోహా: భారత స్టార్‌ క్యూయిస్ట్‌ పంకజ్‌ అడ్వాణీ 24వ సారి ప్రపంచ టైటిల్‌ సాధించాడు. అతడు మంగళవారం ఐబీఎస్‌ఎఫ్‌ 6-రెడ్‌ స్నూకర్‌ ప్రపంచకప్‌లో విజేతగా నిలిచాడు. ఫైనల్లో పంకజ్‌ 7-5తో పాకిస్థాన్‌కు చెందిన బాబర్‌ మసిష్‌పై విజయం సాధించాడు. ఒక దశలో పంకజ్‌ 6-2తో సులభంగా టైటిల్‌ గెలిచేలా కనిపించాడు. అయితే ప్రత్యర్థి వరుసగా మూడు ఫ్రేమ్‌లు నెగ్గి పంకజ్‌కు గట్టిపోటీనిచ్చాడు. ఈ సమయంలో పంకజ్‌ ఆధిపత్యం చెలాయించి ఫ్రేమ్‌ గెలిచి టైటిల్‌ అందుకున్నాడు. పంకజ్‌ గతవారమే 11వ సారి ఆసియా టైటిల్‌ను గెలుచుకున్నాడు. ‘‘ఇది కలలా ఉంది. చాలా కాలం టేబుల్‌కు దూరంగా ఉన్నా.. ఇలా వరుసగా రెండు టైటిళ్లు సాధించడం నాలో గెలవాలన్న కసి, నైపుణ్యం తగ్గలేదన్న నమ్మకాన్ని కలిగిస్తోంది. ఈ టైటిళ్లు గెలవడం నా అదృష్టం. దేశం తరఫున రెండు పతకాలు గెలిచినందుకు సంతోషంగా ఉంది’’ అని పంకజ్‌ చెప్పాడు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన