close

తాజావార్తలు

మయాంక్‌ ఔట్‌: భారీ స్కోరువైపు భారత్‌

పుణె: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ మెరుగైన స్కోరు దిశగా సాగుతోంది. 77 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. సారథి విరాట్‌ కోహ్లీ (37; 79 బంతుల్లో 5×4) అర్ధశతకం వైపు పయనిస్తున్నాడు. అతడికి వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె (9; 47 బంతుల్లో 2×4) తోడుగా ఉన్నాడు. వీరిద్దరూ 98 బంతుల్లో 40 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అంతకు ముందు అద్భుత శతకం బాదిన మయాంక్‌ అగర్వాల్‌ (108; 195 బంతుల్లో 16×4, 2×6) జట్టు స్కోరు 198 వద్ద ఔటయ్యాడు. రబాడ ఆఫ్‌సైడ్‌ వేసిన బంతిని ఆడిన మయాంక్‌ స్లిప్‌లో డుప్లెసిస్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. భుజాల మీదకు వచ్చిన బంతిని డుప్లెసిస్‌ ఒడిసిపట్టుకున్నాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.