close
సమన్వయంతో ధాన్యం నిల్వ సమస్యకు అడ్డుకట్ట

ఎఫ్‌సీఐ, పౌరసరఫరాల సంస్థ నిర్ణయం

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: సమన్వయంతో పనిచేస్తూ ధాన్యం నిల్వ సమస్యను అధిగమించాలని భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ), పౌరసరఫరాల సంస్థ నిర్ణయించాయి. పౌరసరఫరాల భవన్‌లో శుక్రవారం కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఎఫ్‌సీఐ జనరల్‌ మేనేజర్‌ అశ్వినీకుమార్‌, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ధాన్యం దిగుబడులకు అనుగుణంగా బియ్యం నిల్వ చేసేందుకు గోదాములు కేటాయించాలని కమిషనర్‌ ఎఫ్‌సీఐ అధికారులను కోరారు. ఖరీఫ్‌లో 55లక్షలు, రబీలో 37 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. గతేడాది రబీకి సంబంధించిన 11 లక్షల మెట్రిక్‌ టన్నుల సీఎంఆర్‌ బియ్యాన్ని అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని, సీఎంఆర్‌ బకాయిలు రూ.888 కోట్లు, ఆర్డీసెస్‌ రూ.95 కోట్లను తక్షణమే విడుదల చేయాలని కోరారు. కొత్తగూడెం, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాల్లో అధికంగా ఉన్న నిల్వ సమస్యలను పరిష్కరించాలని కమిషనర్‌ చేసిన విజ్ఞప్తిపై ఎఫ్‌సీఐ అధికారులు సానుకూలంగా స్పందించారని పౌరసరఫరాల శాఖ కార్యాలయం ప్రకటనలో పేర్కొంది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.