close
నీరా విధానం..  గౌడ కులస్థులకే ప్రాధాన్యం

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వెల్లడి

బర్కత్‌పుర, న్యూస్‌టుడే: త్వరలో రాష్ట్రప్రభుత్వం ప్రకటించనున్న ‘నీరా’ విధానంలో గౌడ కులస్థులకే ప్రాధాన్యం ఉంటుందని ఆబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వెల్లడించారు. తెలంగాణ గౌడ, కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం బర్కత్‌పురలోని తెలంగాణ యువతి మండలిలో గౌడ కులస్థుల ఆత్మీయ సమ్మేళనం, అలయ్‌-బలయ్‌ నిర్వహించారు. మంత్రి ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ.. త్వరలో ట్యాంక్‌బండ్‌ వద్ద ప్రయోగాత్మకంగా నీరా స్టాల్‌ ప్రారంభించనున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లాల్లో ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో మండలి మాజీ ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, జాజుల శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌, తెలంగాణ గౌడకల్లుగీత సంఘాల సమన్వయ సమితి ఛైర్మన్‌ బాలగోని బాలరాజ్‌గౌడ్‌, తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాగరాజుగౌడ్‌ పాల్గొన్నారు.

జిల్లాల్లో సెట్విన్‌, స్టెప్‌ శిక్షణ కేంద్రాలు
ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనకు అన్ని జిల్లాల్లో ప్రభుత్వ సంస్థలైన సెట్విన్‌, స్టెప్‌ శిక్షణ కేంద్రాలు ఏర్పాటుచేస్తామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. దీనిపై త్వరలోనే కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన యువజన సంక్షేమంపై సమీక్ష నిర్వహించారు.

* టోక్యో ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌లో పోటీపడేందుకు తనకు, మేరీకోమ్‌కు మధ్య ట్రయల్‌ నిర్వహించాలని పోరాడుతున్న తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ (51 కేజీ)కు మద్దతుగా కేంద్ర క్రీడల మంత్రి కిరణ్‌ రిజిజుకు రాష్ట్ర క్రీడల మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మంగళవారం లేఖ రాశారు. అంతర్జాతీయ స్థాయిలో విశేషంగా రాణిస్తున్న నిఖత్‌కు మేరీకోమ్‌తో తలపడే అవకాశం దక్కేలా చూడాలని కోరారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.