close
శ్మశానాలు, డంపింగ్‌ యార్డులకు అటవీ భూములు

సామూహిక అవసరాలకు వాడొచ్చని స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం

ఈనాడు, హైదరాబాద్‌: అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులు, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ హక్కుదారులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ఓ ప్రధాన సమస్యకు పరిష్కారం లభించింది. శ్మశానాలు, డంపింగ్‌ యార్డులు ఏర్పాటు చేసుకోవడానికి అటవీ భూములను వాడుకునే వెసులుబాటు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్‌ ఎస్‌.కె.జోషి సంబంధిత శాఖలకు సర్క్యులర్‌ జారీ చేశారు.

ఇప్పటివరకు అటవీ భూములపై ఆధారపడి జీవిస్తున్నవారికి వాటిని సాగుచేసుకునేందుకు అటవీ హక్కులు చట్టం కింద పట్టాలు వచ్చినప్పటికీ సామూహిక అవసరాల విషయంలో మాత్రం కష్టాలు తీరలేదు. శ్మశానాలు, డంపింగ్‌ యార్డుల ఏర్పాటుకు సమస్య ఎదురయ్యేది. ఇది అటవీ భూమంటూ అధికారులు అభ్యంతరం చెప్పేవారు. ఇటీవల కలెక్టర్ల సమావేశం నిర్వహించిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ సమస్య వచ్చింది. అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్‌), సీఎం ఓఎస్డీతో రాష్ట్ర సీఎస్‌ సోమవారం ఈ విషయంపై చర్చించారు. ఇలాంటి వాటికి వాడడంతో అడవికి జరిగే నష్టం తక్కువేనని.. తక్కువ భూమిలో ఈ అవసరాలు తీర్చుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు సమాచారం. సామూహిక అవసరాలకు కనీస సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని.. ఇందుకు అటవీ భూముల్ని వాడొచ్చన్న విషయం ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ చట్టంలో ఉంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ హక్కులు ఉన్నవాళ్లు శ్మశాన, దహన వాటికలు.. డంపింగ్‌యార్డుల కోసం అటవీ భూముల్ని వాడొచ్చని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సర్క్యులర్‌ను జిల్లా కలెక్టర్లకు కూడా పంపింది.

సభ ఆమోదం తర్వాత..
శ్మశాన వాటికలు, డంపింగ్‌ యార్డులు లేనిచోట వాటిని ఏర్పాటు చేసుకోవాలంటే ఆ గ్రామసభ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. అనంతరం జిల్లాస్థాయి కమిటీ ఆమోదించాక ఆయా అవసరాలకు స్థలాన్ని అటవీ భూమి నుంచి మంజూరు చేయనున్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.