ముస్లింలకు సీఎం కేసీఆర్‌ రంజాన్‌ శుభాకాంక్షలు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ముస్లింలకు సీఎం కేసీఆర్‌ రంజాన్‌ శుభాకాంక్షలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ముస్లింలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ రంజాన్‌ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్షలతో రంజాన్‌ మాసం.. శాంతి, ప్రేమ, దయ, సౌభ్రాతృత్వ గుణాలను పంచుతోందని, రాష్ట్రంలో గంగా జమునా తహజీబ్‌కు(సంస్కృతికి) ఈ పండుగ ప్రతీక అని సీఎం అన్నారు. మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు ముస్లింల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని, దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ముఖ్యమంత్రి సందేశం విడుదల చేశారు. శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, మహమూద్‌అలీ, కేటీ రామారావు, హరీశ్‌రావు తదితరులు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తెదేపా తెలంగాణ అధ్యక్షుడు ఎల్‌.రమణ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు.
బసవేశ్వరుడు అభ్యుదయవాది
మహాత్మ బసవేశ్వరుని జయంతి సందర్భంగా వీరశైవ లింగాయత్‌లకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. మనుషుల మధ్య అసమానతలను పెంచే కుల, వర్ణ, లింగ వివక్షలను వ్యతిరేకించిన బసవేశ్వరుడు అభ్యుదయవాదిగా, పాలనాదక్షుడిగా పేరొందారన్నారు. వీరశైవ లింగాయత్‌ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం చెప్పారు.
సంతోషంగా నిర్వహించుకోవాలి: గవర్నర్‌
రాష్ట్రంలోని ముస్లింలు రంజాన్‌ పండుగ సందర్భంగా మంచి ఆరోగ్యం, శ్రేయస్సు, శాంతిని పొందాలని గవర్నర్‌ తమిళిసై ఆకాంక్షించారు. రంజాన్‌ సందర్భంగా ఆమె ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. కరోనా నిబంధనల మేరకు పండుగను సురక్షితంగా, సంతోషంగా నిర్వహించుకోవాలని సూచించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని