నా సమక్షంలోనే జడ్జీల దస్త్రం ఆమోదం: కిషన్‌రెడ్డి
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నా సమక్షంలోనే జడ్జీల దస్త్రం ఆమోదం: కిషన్‌రెడ్డి

ఈనాడు, దిల్లీ, గన్‌ఫౌండ్రి, న్యూస్‌టుడే: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు దస్త్రాన్ని తన సమక్షంలోనే కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఆమోదించారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలన్న డిమాండ్‌పై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణతో సంప్రదించి ఆయన అనుకూల నిర్ణయం తీసుకున్నారని వివరించారు. తెలంగాణ న్యాయ వ్యవస్థ చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజని అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తుల సంఖ్య పెరగడంతో న్యాయ ప్రక్రియ వేగవంతమై తెలంగాణ హైకోర్టు దేశానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు.
ప్రతిభావంతులైన న్యాయవాదులకు

మెరుగైన అవకాశాలు
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచడంతో ప్రతిభావంతులైన న్యాయవాదులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ ఎ.నరసింహారెడ్డి పేర్కొన్నారు. బార్‌ కౌన్సిల్‌ సభ్యుల తరఫున సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
హైకోర్టులో పెండింగ్‌ కేసుల సత్వర పరిష్కారానికి న్యాయమూర్తుల సంఖ్య పెంపు దోహదపడుతుందని భాజపా జాతీయ కార్యవర్గసభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు పేర్కొన్నారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు