నయీం డైరీలను తెరిచేదెన్నడు..?
close

ప్రధానాంశాలు

నయీం డైరీలను తెరిచేదెన్నడు..?

సమగ్ర దర్యాప్తునకు ఆదేశించండి
గవర్నర్‌కు సుపరిపాలన వేదిక ఫిర్యాదు

ఈనాడు, హైదరాబాద్‌: కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ నయీం ఇంట్లో దొరికిన 130 డైరీల్లోని సమాచారంపై సమగ్ర దర్యాప్తు జరిపేలా పోలీసుల్ని ఆదేశించాలని సుపరిపాలన వేదిక(ఎఫ్‌జీజీ) శనివారం గవర్నర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో కోరింది. నయీం ఎన్‌కౌంటర్‌ అనంతరం పోలీసులు స్వాధీనం చేసుకున్న డైరీలను మూటగట్టి న్యాయస్థానంలో సమర్పించినట్లు పోలీసులు చెబుతున్నారని వేదిక నేతలు పేర్కొన్నారు. డైరీలతో పాటు దొరికిన 603 సెల్‌ఫోన్లను విశ్లేషించినప్పుడు కీలక రాజకీయ నేతలు, పోలీస్‌ అధికారుల పేర్లు బహిర్గతమైనా పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి రాలేదని అనుమానంగా ఉందన్నారు. నార్త్‌జోన్‌ ఐజీ నాగిరెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన సిట్‌ దర్యాప్తు మొదటి నుంచీ పక్కదారి పట్టిందని ఆరోపించారు. నయీంతో సంబంధమున్న నేరాలపై సిట్‌ ఇప్పటివరకు 250 వరకు కేసులు నమోదు చేసినా ఎక్కడా డైరీల్లోని సాక్ష్యాధారాల ప్రస్తావన లేదన్నారు. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని తాము కోరినా ప్రభుత్వం అంగీకరించలేదని గుర్తు చేశారు. ప్రధాని కార్యాలయానికి తాము పంపిన లేఖ తగు చర్య కోసం రాష్ట్రప్రభుత్వానికి బదిలీ అయినా స్పందన కరవైందన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని