విశాఖలో రూ.1600 కోట్ల ఆస్తుల బదలాయింపు!
close

ప్రధానాంశాలు

విశాఖలో రూ.1600 కోట్ల ఆస్తుల బదలాయింపు!

15 ఆస్తులపై సీసీఎల్‌ఏకు కలెక్టర్‌ నివేదిక

విశాఖపట్నం, న్యూస్‌టుడే: విశాఖలో రూ.1600 కోట్ల విలువైన 15 ఆస్తులను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్‌ (ఏపీఎస్‌డీసీ)కు బదలాయిస్తూ జిల్లా యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. ఆస్తుల వివరాల ప్రతిపాదనలను సీసీఎల్‌ఏకు జిల్లా ఉన్నతాధికారులు నివేదించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. 15 ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.2వేల కోట్లకుపైగా ఉండవచ్చని అంచనా. మహారాణిపేట, సీతమ్మధార, గోపాలపట్నం, విశాఖ గ్రామీణ తహసీల్దార్‌ కార్యాలయాల పరిధిలో ఈ ఆస్తులున్నాయి. రూ.1600 కోట్ల రుణం కోసం విశాఖలోని 20 ఆస్తులను ఏపీఎస్‌డీసీకి బదలాయించాలని వారం కిందట ప్రభుత్వంనుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఏపీఎస్‌డీసీకి బదలాయించే ఆస్తులను పూచీకత్తుగా చూపి రుణాలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. తొలుత పంపిన వివరాల్లో కలెక్టరేట్‌ భవన సముదాయం, గవర్నర్‌ బంగ్లా, దేవాదాయశాఖ ఆధీనంలోని టర్నర్‌చౌల్ట్రీ, ఏపీ బిల్డ్‌ కింద అమ్మకానికి పెట్టిన జిల్లా శిక్షణ కేంద్రం(డీటీసీ) భవన సముదాయం, పశుసంవర్థక శాఖ ఉద్యోగుల సహకార సొసైటీకి కేటాయించిన స్థలాలను ఏపీఎస్‌డీసీ బదలాయించాలని సూచించారు. ప్రాచీన కట్టడాలైన కలెక్టరేట్‌, గవర్నర్‌ బంగ్లా, టర్నర్‌చౌల్ట్రీ స్థలాల బదలాయింపుపై విమర్శలు రావడంతో జిల్లా యంత్రాంగం వాటిని మినహాయించింది. సొసైటీ స్థలం ప్రభుత్వ ఆస్తి కానందున దాన్ని పక్కన పెట్టినట్లు సమాచారం.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని