తగ్గిన ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ ధరలు

ప్రధానాంశాలు

తగ్గిన ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ ధరలు

ఈనాడు, హైదరాబాద్‌: ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ ధరలను దక్షిణ మధ్య రైల్వే తగ్గించింది. సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ రైల్వే స్టేషన్లలో రూ.20గా, సికింద్రాబాద్‌ రైల్వే డివిజన్‌లోని మిగతా స్టేషన్లలో రూ.10గా నిర్ణయించింది. కొవిడ్‌-19 వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా రద్దీని నియంత్రించడానికి సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ రైల్వేస్టేషన్లలో ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ ధరను ఏప్రిల్‌ నెలాఖరులో రూ.50కి, మిగతా స్టేషన్లలో రూ.20కి పెంచిన విషయం తెలిసిందే. కరోనా తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు నెలకొంటుండటంతో తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు ద.మ. రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి సీహెచ్‌.రాకేష్‌ తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని