సెప్టెంబరు నాటికి బయోలాజికల్‌.ఇ టీకా

ప్రధానాంశాలు

సెప్టెంబరు నాటికి బయోలాజికల్‌.ఇ టీకా

ఈనాడు, హైదరాబాద్‌: బయోలాజికల్‌.ఇ నుంచి త్వరలో కొవిడ్‌-19 టీకా రానుంది. ‘కార్బివ్యాక్స్‌’ పేరుతో ఈ టీకాను ఈ ఏడాది సెప్టెంబరు నాటికి అందుబాటులోకి తేవాలని కంపెనీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టీకాపై మూడో దశ క్లినికల్‌ పరీక్షలు జరుగుతున్నాయి. కార్బివ్యాక్స్‌ టీకాను కొనుగోలు చేసేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు నాటికే ఈ టీకాకు అత్యవసర అనుమతి సంపాదించాలని, సెప్టెంబరు నుంచి పంపిణీ ప్రారంభించి, డిసెంబరు నాటికి 30 కోట్ల డోసుల టీకా అందించాలని కంపెనీ భావిస్తోందని సంబంధిత వర్గాలు తెలియజేశాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని