ఆర్జీయూకేటీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌

ప్రధానాంశాలు

ఆర్జీయూకేటీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌

పాలిసెట్‌ మార్కుల ఆధారంగా ప్రవేశాలు

బాసర, న్యూస్‌టుడే: నిర్మల్‌ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీలో 2021-22 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విద్యాలయ ఏవో రాజేశ్వర్‌రావు, సిబ్బంది శనివారం విడుదల చేశారు. గతంలో పదో తరగతిలో వచ్చిన జీపీఏ ఆధారంగా ప్రవేశాలు నిర్ణయించేవారు. ఈసారి పాలిసెట్‌ పరీక్షలో వచ్చిన మార్కులను ప్రామాణికంగా తీసుకోనున్నారు. విద్యార్థులు ఆగస్టు 2 నుంచి 12 తేదీల మధ్య పాలిసెట్‌ మార్కులతో ఆర్జీయూకేటీకి దరఖాస్తు సమర్పించాలి. ఆగస్టు 18వ తేదీన ఎంపికైనవారి జాబితాను విడుదల చేస్తారు. వివరాలకు 6304893876 నంబరులో లేదా dmissions@rgukt.ac.in కు మెయిల్‌ ద్వారా సంప్రదించవచ్చు.

సీట్ల సంఖ్యపై స్పష్టత కరవు...

విద్యాలయంలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసినా.. సీట్ల సంఖ్యకు సంబంధించి ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. గత ఏడాది 1500 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించగా ఈసారి ఆసంఖ్యను కుదించే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం నుంచి తక్కువ నిధుల కేటాయింపు ఉన్నందున ఈసారి ప్రవేశాలను 1000 మందికి పరిమితం చేయాలని భావిస్తున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని