గజ్వేల్‌లో సమీకృత క్రీడాకేంద్రం

ప్రధానాంశాలు

గజ్వేల్‌లో సమీకృత క్రీడాకేంద్రం

ఈనాడు, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో 15 ఎకరాల్లో సమీకృత క్రీడా కేంద్రం (ఇంటిగ్రేటెడ్‌ స్పోర్ట్స్‌ హబ్‌) ఏర్పాటుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలంగాణ క్రీడాప్రాధికార సంస్థ (సాట్స్‌) ఛైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఇప్పటికే తాను గజ్వేల్‌లో పర్యటించి, సిద్దిపేట జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ, మంత్రి హరీశ్‌రావు సూచనలతో పలువురు క్రీడాసంఘాల ప్రతినిధులు, క్రీడా నిపుణులతో చర్చించి, ప్రణాళికను రూపొందిస్తున్నామని వివరించారు. క్రీడాకేంద్రానికి అవసరమైన స్థలాన్ని సేకరిస్తున్నామని, దీన్ని మినీ క్రీడా గ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు. త్వరలో క్రీడల మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో నిర్వహించనున్న ఉన్నత స్థాయి సమీక్షలో తుది ప్రణాళిక తయారు చేసి సీఎం కేసీఆర్‌కు సమర్పిస్తామని తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని