బీబీనగర్‌ ఎయిమ్స్‌ సమస్యలను పరిష్కరించండి

ప్రధానాంశాలు

బీబీనగర్‌ ఎయిమ్స్‌ సమస్యలను పరిష్కరించండి

కేంద్ర మంత్రి మాండవీయకు బండి సంజయ్‌ వినతి

ఈనాడు, దిల్లీ: బీబీనగర్‌లోని ఎయిమ్స్‌ ఆసుపత్రి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ ఎల్‌.మాండవీయకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ విజ్ఞప్తి చేశారు. కేంద్రమంత్రిని సంజయ్‌, బీబీనగర్‌ ఎయిమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వికాస్‌ భాటియా తదితరులు బుధవారం కలిశారు. ఎయిమ్స్‌ మాస్టర్‌ప్లాన్‌ అమలుకు టెండర్‌ ప్రక్రియ పూర్తయినందున, వచ్చే నెలలో జరగబోయే శంకుస్థాపనకు ప్రధాని మోదీని ఆహ్వానించాలని కోరారు. తెలంగాణ స్థాయికి తగినట్లు బీబీనగర్‌ ఎయిమ్స్‌ పేరు మార్చాలని కేంద్ర మంత్రికి ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం 16 సీనియర్‌, 16 జూనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు మంజూరు చేశారని, అదనంగా మరిన్ని ఇవ్వాలని కోరారు. కీలక ప్రాంతాలకు వెళ్లే రైళ్లు బీబీ నగర్‌లో నిలిపేలా చొరవ చూపాలని కోరారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని