సభ్యులు సభా గౌరవం కాపాడాలి

ప్రధానాంశాలు

సభ్యులు సభా గౌరవం కాపాడాలి

సభాపతి పోచారం

ఈనాడు, హైదరాబాద్‌: చట్టసభల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత సభ్యులందరిపై ఉందని తెలంగాణ శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. చట్టసభలలో జరుగుతున్న అల్లర్లు, దూషణలు.. వాటి గౌరవాన్ని తగ్గస్తాయన్నారు. సంసద్‌ టీవీలో లోక్‌సభ, రాజ్యసభలతోపాటు, అన్ని రాష్ట్రాల శాసనసభ, మండలి సమావేశాలను ప్రసారం చేయాలని సూచించారు. బుధవారం 81వ అఖిల భారత శాసనసభాపతులు, మండలి ఛైర్మన్ల దృశ్యమాధ్యమ సమావేశంలో ఆయన హైదరాబాద్‌ నుంచి మాట్లాడారు.

నేడు పల్లా ప్రమాణం: వరంగల్‌-నల్గొండ-ఖమ్మం జిల్లాల పట్టభద్ర నియోజకవర్గం శాసనమండలి సభ్యుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శాసన మండలిలో ఉదయం 10 గంటలకు ప్రొటెం ఛైర్మన్‌ భూపాల్‌ రెడ్డి ఆయనతో ప్రమాణం చేయిస్తారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని