గవర్నర్‌ హైదరాబాద్‌ విమోచన శుభాకాంక్షలు

ప్రధానాంశాలు

గవర్నర్‌ హైదరాబాద్‌ విమోచన శుభాకాంక్షలు

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ విమోచన దినాన్ని శుక్రవారం(సెప్టెంబర్‌17) జరుపుకుంటున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ తమిళిసై శుభాకాంక్షలు తెలిపారు. నైజాం ప్రాంతంలో జరిగిన పోరాటం చారిత్రక స్వాతంత్య్ర పోరాటాలలో ఒకటిగా నిలిచిందన్నారు. ‘‘1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ, తెలంగాణ, మరఠ్వాడా, హైదరాబాద్‌-కర్ణాటకలతో కూడిన హైదరాబాద్‌ 1948 సెప్టెంబర్‌ 17న స్వేచ్ఛా వాయువులను పీల్చుకోగలిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ విమోచన దినాన్ని అంతా జరుపుకోవాలి. ఈ పోరాటంలో త్యాగాలు చేసిన అమరవీరులకు తెలంగాణ ప్రజలు ఘన నివాళులు అర్పించాలి’’ అని గవర్నర్‌ కోరారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని