ప్రతీ ఊరిలో, గుడిలో జమ్మి చెట్టు

ప్రధానాంశాలు

ప్రతీ ఊరిలో, గుడిలో జమ్మి చెట్టు

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో కొత్త కార్యక్రమం

ఈనాడు, హైదరాబాద్‌, బేగంపేట, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్ర వృక్షమైన జమ్మి చెట్టును ప్రతీ ఊరిలో, ప్రతీ గుడిలో నాటించేందుకు దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టామని గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ వ్యవస్థాపకుడు, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని బేగంపేటలో దీనికి సంబంధించిన గోడపత్రికలను ఆయన అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారిలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంతోష్‌కుమార్‌ మాట్లాడుతూ.. దసరా రోజు జమ్మి చెట్లను పూజించి వాటి ఆకులను బంధుమిత్రులకు ఇచ్చిపుచ్చుకోవడం సంప్రదాయమన్నారు. అంతరించిపోతున్న ఆ వృక్షాల సంఖ్యను పెంచాలన్న ఉద్దేశంతో విజయదశమి సందర్భంగా గ్రామాల్లో జమ్మి చెట్లను అందజేయనున్నామని, ఇప్పటికే 20 వేల వరకు సేకరించామని వివరించారు. వీటి పంపిణీకి ప్రభుత్వపరంగా సహకరిస్తామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక జమ్మిచెట్టును సీఎం కేసీఆర్‌ రాష్ట్రవృక్షంగా ప్రకటించారని రమణాచారి గుర్తుచేశారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని