ఎక్కువకాలం దేశానికి సేవలందించాలి

ప్రధానాంశాలు

ఎక్కువకాలం దేశానికి సేవలందించాలి

ప్రధానికి సీఎం జన్మదిన శుభాకాంక్షలు

ఈనాడు, హైదరాబాద్‌:  ప్రధాని నరేంద్రమోదీ 71వ పుట్టినరోజు సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రభుత్వం, రాష్ట్ర ప్రజల తరఫున ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని భవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఎక్కువ కాలం దేశానికి సేవలందించాలి’ అని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ప్రధానికి తమ సందేశాన్ని పంపించారు.


గవర్నర్‌తో జర్మనీ రాయబారి భేటీ

భారత్‌లో జర్మనీ రాయబారి వాల్టర్‌ జే లిండార్‌, కాన్సుల్‌ జనరల్‌ కరిన్‌ స్టోల్‌లు శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసైని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భారత్‌, జర్మనీ సంబంధాల గురించి చర్చించారు.


డేటా ఎనలిటిక్స్‌ హ్యాకథాన్‌

రాష్ట్ర ఆవిష్కరణల విభాగం ఆధ్వర్యంలో నిర్వహించే డేటా అనలిటిక్స్‌ హ్యకథాన్‌ను విద్యార్థులు ఈ నెల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని టీఎస్‌ఐసీ శుక్రవారం కోరింది. జిల్లా, రాష్ట్ర, స్థాయి విజేతలకు డేటా ఎనలిటిక్స్‌ రంగంలో అవకాశాలు లభిస్తాయని పేర్కొంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని