close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రైతు నేస్తం.. పల్లెపథం

లఘుచిత్రాల పోటీలకు ఆహ్వానం

ఈనాడు, హైదరాబాద్‌: పల్లె వాతావరణం.. వ్యవసాయం.. కర్షకుల జీవన స్థితిగతులపై ‘రైతు నేస్తం.. పల్లెపథం!’ పేరుతో లఘుచిత్రాల పోటీలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రైతు నేస్తం  సంపాదకులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్‌ యడ్లపల్లి వెంకటేశ్వరరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులు, యువకులు తమ ప్రతిభను చాటుకునేందుకు ఇది చక్కటి అవకాశమన్నారు. లఘుచిత్రాల రచయితలు, దర్శకులు, నిర్మాతలు, కళాకారులు సైతం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు.
మొత్తం 14 నిమిషాల నిడివితో చిత్రాన్ని నిర్మించి జులై 31కల్లా పంపించాలని కోరారు. వచ్చిన చిత్రాల్లో ఉత్తమమైన మూడింటిని ఎంపిక చేస్తామన్నారు. మొదటి ఉత్తమ చిత్రానికి రూ.లక్ష, రెండో ఉత్తమ చిత్రానికి రూ.75 వేలు, మూడో ఉత్తమ చిత్రానికి రూ.50 వేలు నగదు పారితోషికం అందిస్తామన్నారు. మరిన్ని వివరాలకు   99490 94370, 95538 25532 ఫోన్‌ నంబర్లు, ‌www.rythunestham.in
వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చన్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.