close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పారిశ్రామిక వాడల్లో కరోనా భయం

 క్రమేపీ పెరుగుతున్న కేసులు
 పనులకు రావడానికి కార్మికుల జంకు
ఉత్పత్తులు, క్రయవిక్రయాలపై ప్రభావం
ఈనాడు - హైదరాబాద్‌

చర్లపల్లి.. జీడిమెట్ల.. గాంధీనగర్‌.. బాలానగర్‌.. సహా రాష్ట్రంలోని పలు పారిశ్రామిక వాడల్లో కరోనా భయాందోళనలు కలిగిస్తోంది. పారిశ్రామికవేత్తలు, కార్మికులు, ఉద్యోగులు వైరస్‌ బారిన పడుతున్నారు. ఇది పారిశ్రామిక రంగంపై ప్రభావం చూపుతోంది. చాలాచోట్ల కార్మికులు విధులకు హాజరుకావడానికి భయపడుతున్నారు. దీంతో ఉత్పత్తికి విఘాతం కలుగుతోంది. రాష్ట్రంలోని 156 పారిశ్రామికవాడల్లో 62వేల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు నడుస్తుండగా 12లక్షల మందికిపైగా కార్మికులు పనిచేస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో చాలా పరిశ్రమలు మూతపడ్డాయి. లాక్‌డౌన్‌ అనంతరం ఆలస్యంగా పరిశ్రమలకు అవకాశమిచ్చారు. పునఃప్రారంభం తర్వాత పరిశ్రమలు ఆశాజనకంగా ఉత్పత్తులు ప్రారంభించాయి. కరోనాను నివారించేందుకు జాగ్రత్త చర్యలు తీసుకున్నాయి. అయినా క్రమేపీ కేసులు మొదలయ్యాయి. రాష్ట్రంలో అతిపెద్ద పారిశ్రామికవాడల్లో ఒకటైన చర్లపల్లిలో ప్రముఖ పారిశ్రామికవేత్తలకు వైరస్‌ సోకడం కలకలం సృష్టించింది. తర్వాత గాంధీనగర్‌, జీడిమెట్ల, బాలానగర్‌లలో పారిశ్రామికవేత్తలకు, కార్మికులకు వ్యాధి సోకింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 300మందికిపైగా బాధితులున్నారు. పారిశ్రామికవాడల్లో అప్రమత్తంగా ఉన్నా కార్మికుల్లో చాలామంది బస్తీల్లో అద్దె ఇళ్లల్లో ఉంటారు. ఆయాచోట్ల కరోనా సోకడం వల్ల కార్మికులు కొందరు వ్యాధి బారినపడుతున్నారు. కొందరికి కుటుంబ సభ్యుల ద్వారా వస్తోంది. ఇది గుర్తించక విధులకు వచ్చినవారి వల్ల ఇతర కార్మికులకు సోకుతోంది.
విధులకు రావాలంటే..
కరోనా భయంతో కార్మికులు పనులకు రావడంలేదు. ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు స్వస్థలాలకు వెళ్లి వెనక్కి రాలేదు. దీంతో పారిశ్రామికవేత్తలు స్థానిక కార్మికులను వినియోగించుకుంటున్నారు. కరోనా భయంతో చాలామంది విధులకు రావడంలేదు. కొంతమంది వచ్చి పరిస్థితులు తెలుసుకొని వెళ్లిపోతున్నారు. దీంతో ఉత్పత్తులు తగ్గాయి. కరోనా భయంతో కొంతమంది జిల్లాల్లోని తమ సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. పలువురు పారిశ్రామికవేత్తలు తమ సంస్థలను మూసివేశారు. ముడిసరుకులు, ఆర్డర్లు, ఉత్పత్తుల క్రయవిక్రయాల మార్కెటింగుకు వారు తిరగడం లేదు. ఫోన్ల మీదనే ఆధారపడుతున్నారు. కరోనా వల్ల కంపెనీలను కలవకపోవడం వల్ల ఆశించిన మేరకు ఆర్డర్లు కావడం లేదని పారిశ్రామికవేత్త స్వామి తెలిపారు.


అప్రమత్తం చేస్తున్నాం

కరోనా గురించి పారిశ్రామికవాడల్లో అందరినీ అప్రమత్తం చేస్తున్నాం. వారికి అన్నిరకాల జాగ్రత్తలు చెబుతున్నాం. వ్యాధి సోకినవారు కోలుకుంటున్నారు. కరోనా దృష్ట్యా అన్ని పరిశ్రమల వద్ద ఉష్ణోగ్రత కొలిచి ఎక్కువగా ఉంటే వారిని పనికి అనుమతించడం లేదు. మాస్క్‌లు, శానిటైజర్లు తప్పనిసరి చేయించాం. కరోనా ప్రభావంతో పారిశ్రామికరంగం ఇబ్బందులు పడుతోంది. ప్రభుత్వం దృష్టికి దీనిని తీసుకెళ్లాం.

-తెలంగాణ పారిశ్రామికవేత్తల సంఘం అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి


 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.