close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నా గ్రామం మురికి రహితం

 పారిశుద్ధ్యం.. పరిశుభ్రతపై  8 నుంచి వారోత్సవాలు
 విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పోటీలు

ఈనాడు, హైదరాబాద్‌: ‘గంధగీ ముక్త భారత్‌ (జీఎంబీ)’ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్‌, స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ రఘునందన్‌రావు ఆదేశించారు. పారిశుద్ధ్యం, పరిశుభ్రత పట్ల ప్రజల ప్రవర్తనలో మార్పు తీసుకురావడం లక్ష్యంగా దేశవ్యాప్తంగా ఈ నెల 8 నుంచి వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఈ వారోత్సవాల అమలుపై సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లకు రఘునందన్‌రావు మార్గదర్శకాలు జారీచేశారు.
ఇవీ మార్గదర్శకాలు
* 8న సర్పంచులతో జిల్లా కలెక్టర్లు సమావేశం నిర్వహించాలి.
* 9న సర్పంచుల ఆధ్వర్యంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు సేకరించాలి. వాటి నుంచి ఒకసారి ఉపయోగించే ప్లాస్టిక్‌ను వేరు చేయడంపై ప్రజలకు అవగాహన కల్పించాలి.
* 10న గ్రామ పంచాయతీలస్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలను శుభ్రం చేసేందుకు శ్రమదానం కార్యక్రమం చేపట్టాలి. శ్రమదానంపై చైతన్యం కలిగించేందుకు ప్రభుత్వం ప్రత్యేక నంబరు (18001800404) కేటాయించింది.
* 11న పరిశుభ్రతపై ప్రేరణ కలిగించేలా, ప్రజలంతా ఉద్యమించేలా గ్రామాల్లో గోడలపై చిత్రాలు (వాల్‌ పెయింటింగ్‌) గీయించాలి. దీనికి సంబంధించి 5 చిత్రాల నమూనాలను జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే పంపారు.
* 12న మొక్కలు నాటడం, శ్రమదానం నిర్వహించాలి.
* 13న ‘నా గ్రామం మురికి రహితం’ అంశంపై 6, 7 తరగతుల విద్యార్థులకు పెయింటింగ్‌; 9, 10 తరగతుల విద్యార్థులకు వ్యాసరచన పోటీలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలి.
* 14న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలి.
* 15న గ్రామసభలు నిర్వహించి ప్రమాణం చేయించాలి. స్థానికంగా మరిన్ని ప్రయోగాత్మక కార్యక్రమాలు కూడా చేపట్టవచ్చు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.