Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 179637
            [news_title_telugu_html] => 

‘సూటు’పోటి మాటలు

[news_title_telugu] => ‘సూటు’పోటి మాటలు [news_title_english] => [news_short_description] => వెకిలి చేష్టలూ... వెర్రివేషాలు. అతివ కనిపిస్తే చాలు అదుపు తప్పిపోతారు. సూటిపోటి మాటలతో చెలరేగిపోతారు. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/uMUM1zRoouE [news_videoinfo] => |https://www.youtube.com/embed/uMUM1zRoouE [news_sections] => ,33,32, ) )
‘సూటు’పోటి మాటలు - EENADU
close
‘సూటు’పోటి మాటలు

వేధిస్తున్న వారిలో ఉద్యోగులు, వైద్యులు
షీ బృందాల అధ్యయనంలో వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: వెకిలి చేష్టలూ... వెర్రివేషాలు. అతివ కనిపిస్తే చాలు అదుపు తప్పిపోతారు. సూటిపోటి మాటలతో చెలరేగిపోతారు. ఇప్పటివరకూ ఇలాంటి పనులు చేసేది ఆవారాగా తిరిగే పోకిరీరాయుళ్లే అని భావించేవారు. కానీ అమ్మాయిలను వేధిస్తూ ‘షి’ బృందాలకు పట్టుబడుతున్న వారిలో ప్రయివేటు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, వైద్యులూ ఉన్నారని తేలడంతో అధికారులూ అవాక్కవుతున్నారు. అతివలపై వేధింపులను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన ‘షి’ బృందాలకు పట్టుబడ్డ వారిలో ఎవరెవరు ఉంటున్నారన్న విషయాన్ని అధ్యయనం చేసేందుకు ఇటీవల అధికారులు వృత్తుల వారీగా విశ్లేషించారు. విద్యార్థులను పక్కనబెట్టి కేవలం ఉద్యోగాలు చేస్తున్న వారి వివరాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. ఇందులో ఆసక్తికరమైన అంశాలు ఎన్నో వెల్లడయ్యాయి. ఇప్పటివరకు పట్టుబడ్డ వారిలో దాదాపు మూడింట రెండొంతులమంది... అంటే 67 శాతం మంది ప్రైవేటు ఉద్యోగులే ఉంటున్నారు. వీరిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు మొదలుకొని ఇతరత్రా ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న వారూ ఉండటం గమనార్హం.

మూలంలోనే చికిత్స మేలు
వృత్తుల వారీగా వేధింపులకు పాల్పడుతున్న వారి వివరాలు తెలియడంతో భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోబోతున్నారు. వారు పనిచేస్తున్న చోటే అవగాహనా కార్యక్రమాలు చేపట్టే ఆలోచనతో ఉన్నారు. ప్రైవేటు కార్యాలయాలలోనూ సదస్సులు నిర్వహించాలని, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలని అధికారులు భావిస్తున్నారు.

 

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.