close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘డ్రాగన్‌’ ఎండకు దాగెన్‌

ఏప్రిల్‌ మొదటి వారంలోనే 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మండుతున్న ఎండలు.. మనుషులు, జంతువులతో పాటు పంటలకూ నష్టం చేస్తున్నాయి. నల్గొండ జిల్లాలో సాగు చేస్తున్న డ్రాగన్‌ పంట పిందెలు నిలువునా ఎండిపోతున్నాయి. దీన్ని అధిగమించేందుకు అనుముల మండల కేంద్రంలో యువరైతు ప్రణీత్‌రెడ్డి పాత చీరలను సేకరించి పంటకు కప్పి ఎండవేడి నుంచి రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కొంతమేర సత్ఫలితాన్ని ఇస్తోందని ఉద్యానశాఖ అధికారులు అభిప్రాయపడ్డారు. ఇతర ప్రాంతాల్లో ఈ పంటను సాగుచేసిన రైతులు సైతం ఇక్కడికి వచ్చి పరిశీలించి వెళుతున్నారు.

- ఈనాడు, నల్గొండ

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు