నిదానంగా సాగుతోంది..!
close

ప్రధానాంశాలు

నిదానంగా సాగుతోంది..!

గతేడాది వర్షాకాలం కన్నా ఇప్పటి వరకు 8 లక్షల ఎకరాలు తక్కువ..

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో వానాకాలం(ఖరీఫ్‌) పంటల సాగు నిదానంగా సాగుతోంది. గతేడాది జూన్‌ 23కల్లా 30.82 లక్షల ఎకరాల్లో పంటలు సాగైతే.. ఈ ఏడాది బుధవారం(23వ తేదీ) వరకు 22.70 లక్షల ఎకరాల్లోనే రైతులు విత్తనాలు, నాట్లు వేశారని వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. గతేడాదితో పోల్చితే ప్రస్తుతం పంటల సాగు 8.12 లక్షల ఎకరాల దాకా తక్కువగా ఉంది. ఈ సీజన్‌ సాధారణ సాగు విస్తీర్ణం కోటీ 16 లక్షల ఎకరాలకు గాను బుధవారం నాటికి 18.41 లక్షల ఎకరాల్లో విత్తనాలు వేయాలి. సాధారణంకన్నా 4 లక్షల ఎకరాలు ఎక్కువగా సాగైనా.. గతేడాదితో పోలిస్తే ఇది తక్కువేనని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటి వరకు పత్తి 18 లక్షలు, కంది 1.77 లక్షలు, పప్పుధాన్యాలు 3.07 లక్షలు, నూనెగింజలు 1.47 లక్షలు, వరి నాట్లు 26,569 ఎకరాల్లో వేశారు. ఈ నెల 1వ తేదీ నుంచి 23 వరకు వనపర్తి మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో సాధారణంకన్నా ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు వ్యవసాయ శాఖ తెలిపింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని