TS News: ‘రాధిక’.. తినకుండా ఉండలేరిక!
close

ప్రధానాంశాలు

TS News: ‘రాధిక’.. తినకుండా ఉండలేరిక!

కుపచ్చ బెండకాయలు అంతటా చూస్తాం.. కానీ, ఈ రైతు పండించిన బెండ మాత్రం ఆకర్షణీయంగా ఎరుపు రంగులో ఉంది.. వరంగల్‌ అర్బన్‌ జిల్లా హసన్‌పర్తి మండలం పెంబర్తికి చెందిన ప్రభాకర్‌రెడ్డి తన పొలంలో ఈ రకం బెండను పండిస్తున్నారు. ఆకట్టుకునే రంగులో ఉండటం, సేంద్రియ విధానంలో సాగు చేస్తుండటంతో ఎర్ర బెండ కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారని ఆయన చెప్పారు. వంగడం పేరు ‘రాధిక’ అని.. వరంగల్‌లో కొనుగోలు చేశానని, దిగుబడి ఆశాజనకంగా ఉందని వివరించారు. ఈ పంట గురించి విచారణ చేయగా.. సాధారణ రకం కంటే ఎర్రబెండలో సూక్ష్మ పోషకాలు ఎక్కువగా ఉంటాయని వరంగల్‌ ఉద్యానశాఖ అధికారి సుద్దాల శంకర్‌ ‘ఈనాడు’కు తెలిపారు. రక్తహీనత(ఎనీమియా) సమస్య ఎదుర్కొనే వారికి ఇవి ఉపయోగకరంగా ఉంటాయని ఆయన చెప్పారు. చీడపీడల బెడద ఉండని ఈ రకం పంటను బెంగళూరు, సిమ్లా వంటి చల్లని వాతావరణం కలిగిన ప్రాంతాల్లో సాగుచేస్తారని వివరించారు.

- ఈనాడు, వరంగల్‌


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని