close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాశిఫలం

గ్రహబలం (నవంబరు 29 - డిసెంబరు 5)
డా।। శంకరమంచి రామకృష్ణ శాస్త్రి


నోధైర్యంతో నిర్ణయాలు తీసుకోండి. అవసరాలకు ధనం అందుతుంది. ముఖ్యకార్యాల్లో ప్రతిష్ఠంభన ఉంటుంది. కొంతకాలం వాయిదా వేయడం మంచిది. సౌమ్యంగా మాట్లాడుతూ పనులు చేసుకోవాలి. విఘ్నాలున్నా విజయమూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అప్రమత్తంగా ఉండాలి. నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మనశ్శాంతి లభిస్తుంది.


ప్రతి అడుగూ అభివృద్ధి వైపే వేయండి. ముఖ్యకార్యాల్లో లాభం ఉంటుంది. పట్టుదల విజయాన్నిస్తుంది. వ్యాపారంలో నష్టాలు రాకుండా జాగ్రత్త వహించాలి. మాట పట్టింపులు పనికిరావు. మిత్రుల సలహాలవల్ల ఆపదలు తొలగుతాయి. కుటుంబ సభ్యులతో సంప్రదించి చేసే పనులు విజయాన్నిస్తాయి. సూర్యస్తుతి ఉత్తమ ఫలాన్నిస్తుంది.


కల శుభాలూ చేకూరుతాయి. అనుకున్నది జరుగుతుంది. ఉద్యోగ ఫలాలు ఆనందాన్నిస్తాయి. పలు మార్గాల్లో విజయముంది. వ్యాపార లాభం విశేషంగా ఉంటుంది. దృఢ సంకల్పంతో బంగారు భవిష్యత్తును నిర్మించుకుంటారు. ఇంట్లో వారితో సఖ్యత అవసరం. ధనలాభం సూచితం. ఇష్టదైవ స్మరణతో అంతా శుభమే జరుగుతుంది.


శుభప్రదమైన సమయం. అనుకున్న పనులు సమయానికి పూర్తిచేస్తారు. ఉద్యోగంలో బాగుంటుంది. వ్యాపారంలో స్వల్ప విజయం ఉంటుంది. ఆర్థికస్థితి ఉత్తమం. స్థానచలన సూచన ఉంది. అదృష్టవంతులు అవుతారు. మంచి జీవితం లభిస్తుంది. భూ-గృహ-వాహనాది లాభాలున్నాయి. ఇంట్లో శుభం జరుగుతుంది. శివారాధన శ్రేష్ఠం.


ప్రయత్న పూర్వక కార్యసిద్ధి ఉంటుంది. వ్యాపారంలో బాగుంటుంది. ధనలాభం సూచితం. సమస్యల నుండి బయటపడతారు. అనుకున్నది సాధిస్తారు. అధికారుల వల్ల కలసివస్తుంది. మనోబలంతో ముందుకువెళ్లి శ్రేష్ఠమైన భవిష్యత్తును సొంతం చేసుకుంటారు. ఆటంకపరిచేవారున్నా మీ కర్తవ్యాన్ని సమర్థంగా నెరవేర్చండి. సూర్య ఆరాధన మంచిది.


విశేష కార్యసిద్ధి లభిస్తుంది. అధికారలాభాన్ని పొందుతారు. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. వ్యాపారంలో కొంత శ్రమ ఉన్నా ఫలితం బాగుంటుంది. కుటుంబ సభ్యులకు శుభం జరుగుతుంది. ఇంట్లో శాంతి నెలకొంటుంది. ఆర్థికంగా మేలు జరుగుతుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. శుభవార్త వింటారు. ఇష్టదైవస్మరణ మేలు చేస్తుంది.


దృష్టయోగముంది. లక్ష్యం సిద్ధిస్తుంది. అంతా మంచే జరుగుతుంది. ఉద్యోగంలో పైకి వస్తారు. అధికారుల ప్రశంసలుంటాయి. రుణ సమస్యలకు పరిష్కారం దొరుకు తుంది. గొడవలు వద్దు. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. మేలు చేసేవారున్నారు. భవిష్యత్తుకై ప్రణాళికను సిద్ధం చేసుకోండి, కోరుకున్నట్టే జరుగుతుంది. లక్ష్మీ ఆరాధన మంచిది.


నోబలంతో విజయం సాధిస్తారు. కోరుకున్న జీవితం లభిస్తుంది. స్వయంగా చేసే పనుల్లో కార్య సిద్ధి ఉంటుంది. ధర్మ మార్గంలో పేరు సంపాదిస్తారు. పెద్దల మెప్పు పొందుతారు. వివాదాలకు దూరంగా ఉండాలి. వ్యాపారంలో కొంత మేలు జరుగుతుంది. మిత్రుల సహాయంతో ఒకపని పూర్తి అవుతుంది. సమస్యల నుండి బయటపడతారు. సూర్యస్తుతి ఉత్తమం.


దృష్టకాలం మొదలైంది. ప్రారంభించిన పనులు ఆటంకాలు లేకుండా పూర్తి అవుతాయి. ధనలాభం, గృహ లాభం, వాహన సౌఖ్యం వంటి ఫలితాలు ఉన్నాయి. కొన్ని సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. నలుగురికీ ఆదర్శవంతులవుతారు. వాదాలకు తావివ్వకూడదు. పోయినవి తిరిగి లభిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి. ఆదిత్య హృదయం చదివితే మంచిది.


శుభాలు జరుగుతాయి. ఇష్టకార్యాలు సిద్ధిస్తాయి. కొత్త విషయాల్లో పురోగతి ఉంటుంది. ఆనందించే అంశముంది. ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఫలితం లభిస్తుంది. ధనయోగం ఉంది. మంచి పనులు చేసి ఆనందం పొందుతారు. దగ్గరివారితో కలిసి నిర్ణయాలు తీసుకోవాలి. మేలు చేసేవారుఉన్నారు. ఒక వార్త శక్తినిస్తుంది. దుర్గాధ్యానం శుభప్రదం.


ద్యోగంలో కోరుకున్న ఫలితం వస్తుంది. పనులు త్వరగా పూర్తి అవుతాయి. ప్రతిభతో ఆకట్టుకుంటారు. వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తెలియని అవరోధాలు వెంటాడతాయి. దగ్గరివారితో విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. ఆర్థికంగా కలసివస్తుంది. వారాంతంలో ఒక మేలు జరుగుతుంది. ఇష్టదైవాన్ని స్మరించండి.


దృష్టవంతులవుతారు. బ్రహ్మాండమైన కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. వ్యాపారంలో మిశ్రమ ఫలితం గోచరిస్తోంది. అవరోధాలను అధిగమిస్తారు. సమాజంలో గుర్తింపు పొందుతారు. ఆదరాభిమానాలు పెరుగుతాయి. అధికారుల ప్రశంసలున్నాయి. శత్రుదోషం ఇబ్బంది పెడుతుంది. నూతన కార్యాలను ప్రారంభించండి. సూర్యస్తుతి ఉత్తమ కార్యసిద్ధినిస్తుంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు